అనంతపురం

ఆదరణ పనిముట్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. ఆదరణ-2 పథకం కింద సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా పనిముట్లు, రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి అధ్యక్షతన లలితకళాపరిషత్‌లో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ వీరపాండ్యన్, విప్ యామినీబాల, నగర మేయర్ స్వరూప, కమిషనర్ మూర్తి, డిప్యూటీ మేయర్ గంపన్న హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రం లోటుబడ్జెట్‌తో ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని స్థితి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు అభివృద్ధి కోసం శ్రమిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారన్నారు. అదేవిధంగా బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలను అందించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు