అనంతపురం

కందికుంట ఆదేశిస్తే రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, నవంబర్ 14: టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆదేశిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని మున్సిపల్ వైస్ ఛైర్మన్ వసంత పేర్కొన్నారు. బుధవారం ఆమె ఫోన్ ద్వారా మాట్లాడారు. తమ నాయకుడు కందికుంట అండతోనే వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆదేశిస్తే పార్టీకి అనుగుణంగా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాగా గత నెల 24న వైస్ ఛైర్మన్ వసంతపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేయరని ఊహాగానాలు విన్పిస్తున్న తరుణంలో వసంత రాజీనామా చేయడానికి సిద్ధపడడం విశేషం.

నాలుగు రోజుల నుండి విద్యార్థులు పస్తులు
తనకల్లు, నవంబర్ 14: మండల పరిధిలోని ఈతోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగు రోజుల నుండి విద్యార్థులు పస్తులతో అలమటిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఈతోడు పాఠశాలలో గత 12 నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు పడకపోవడంతో పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. 12 నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు అందకపోవడంతో వంట చేయడానికి డబ్బులు లేక ఏజెన్సీ నిర్వాహకులు భోజనం చేయడంలేదన్నారు. మధ్యాహ్న భోజనం కోసం 12 నెలల నుంచి అప్పులు చేశామని, వడ్డీలు కట్టలేక ఇబ్బందులుపడుతున్నామని, ఇంతవరకు బిల్లులు అందకపోతే తాము ఎలా భోజనం చేయాలని ఏజెన్సీ నిర్వాహకులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈఓ ఖాసీంఖాన్‌ను వివరణ కోరగా.. మధ్యాహ్న భోజన బిల్లుల విషయం తనకు సంబంధంలేదని, ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశామని, విద్యార్థులు పస్తులున్నా తాను ఏమీ చేయలేనని తెలిపారు.

కాంగ్రెస్‌తోనే రాష్ట్భ్రావృద్ధి
* పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
లేపాక్షి, నవంబర్ 14 : కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంత జీవనం గడిపారని, గత నాలుగున్నరేళ్లలో దేశంలో అరాచకం నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ కరువైందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందన్నారు. అంతేకాకుండా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. జీఎస్‌టీ ప్రవేశ పెట్టడం ద్వారా చిన్న వ్యాపారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీఎస్‌టీని సరళీకృతం చేస్తామన్నారు. బీజేపీ పాలనలో ప్రజా జీవనం, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్ఫలితాలు సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరగా రఘువీరా కండువాలను వేసి ఆహ్వానించారు.