అనంతపురం

సీఎం రాక సందర్భంగా హంద్రీనీవా కాలువకు పెరిగిన ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, నవంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెలలో జిల్లా పర్యటనకు రానుండడంతో మారాల రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపడానికిగాను హంద్రీనీవా అధికారులు జలాశయంలోకి వచ్చే నీటి ఉద్ధృతిని పెంచారు. ప్రస్తుతం హంద్రీనీవా కాలువ ద్వారా మారాల జలాశయానికి దాదాపు 400 క్యూసెక్కుల నీరు వెళుతోంది. మంగళవారం వరకు 250 క్యూసెక్కుల నీరు వెళుతుండగా మరో 150 క్యూసెక్కుల నీటిని పెంచారు. దీంతో హంద్రీనీవా కాలువ నిండుకుండలా ప్రవహిస్తోంది. బుక్కపట్నం చెరువుకు సైతం నీటిని పోకుండా మొత్తం నీటిని మారాల రిజర్వాయర్ వైపు మళ్లించారు. మారాల రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులకు సమాచారం అందడంతో ముఖ్యమంత్రి వచ్చే లోపు రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపడానికిగాను కాలువలో నీటి మట్టం పెంచారు. మారాల రిజర్వాయర్ నిండితే ఇక జిల్లాలో హంద్రీనీవా కాలువ ద్వారా నింపే రిజర్వాయర్ చెర్లోపల్లి వద్ద మాత్రమే ఉంది. ఆ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండితే ఇక చిత్తూరు జిల్లా వైపు కృష్ణా జలాలు వెళ్లడం ఖాయమనిపిస్తోంది. జనవరి దాకా హంద్రీనీవా కాలువకు నీరు రానుండడంతో ఎటుతిరిగి ఈ యేడు కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు లేకపోయినా హంద్రీనీవా కాలువ పుణ్యమా అని కొత్తచెరువు మండలంలోని పలు చెరువులతోపాటు బుక్కపట్నం మండలంలోని మారాల రిజర్వాయర్ సైతం పూర్తి స్థాయిలో నిండనుండడంతో ఈ ప్రాంతంలో వచ్చే వేసవిలో తాగు, సాగునీటి కొరతకు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు.

బాలికల చదువుతోనే సామాజికాభివృద్ధి
* మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, నవంబర్ 14 : బాలికల చదువుతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో చదువుల ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి మానేసిన అమ్మాయిలను బడిలో చేర్పించేందుకు మూడేళ్ల క్రితం చదువుల ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రెండు వేల మందికిపైగా డ్రాప్‌అవుట్ అమ్మాయిలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించామన్నారు. ఇందులో ప్రభుత్వ ధికారులు సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తల్లితండ్రులు సైతం బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మాయిలకు ఆసరాగా నిలువాలన్న లక్ష్యంతో జీవితంలో స్థిరపడేదాకా ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముదిగల్లు జ్యోతి, వైస్‌చైర్మన్ గాజుల వెంకటేశులు, డీ.హీరేహాల్ తహశీల్దార్ ఖత్రిజన్ కుఫ్రా, ఎంఇఓ నాగమణితోపాటు వార్డుల సభ్యులు పాల్గొన్నారు.

నేడు రాజీవ్, ఇందిరమ్మ విగ్రహాల ఆవిష్కరణ
* హాజరుకానున్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
గుత్తి, నవంబర్ 14 : పట్టణంలోని తాడిపత్రి రోడ్డు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను నేడు ఆవిష్కరించనున్నారు. ఈమేరకు బుధవారం సంబంధిత ఏర్పాట్లను ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ల జీవానందరెడ్డి పర్యవేక్షించారు. విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు హాజరుకానుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎస్సైల వలీబాషా, యువరాజ్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహావిష్కరణలు ప్రధాన కూడలిలో జరగనుండటంతో ట్రాఫిక్‌కు సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు.