అనంతపురం

విజి‘లెన్స్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 14 : అక్రమార్జనకు అలవాటు పడి అధికారుల కళ్లుగప్పి ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల గుండెల్లో ప్రాంతీయ నిఘా, అమలు(విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) దాడులు రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. గత 10 రోజులుగా ప్రాంతీయ శాఖ అధికారి జీ.రామాంజనేయులు నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, పలు శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఆకస్మిక దాడులు, తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా మైన్స్, క్వారీలు, చౌక బియ్యం అక్రమ నిల్వలు, రవాణా, తక్కువ బిల్లులు, జీరో బిల్లులతో గ్రానైట్ రవాణా, అధిక బరువులో స్లాబ్స్ రవాణా, గ్యాస్ ఏజెన్సీల్లో అక్రమాలకు పాల్పడుతుండటంపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సైతం యాడికి మండలం చందన గ్రామం పరిధిలోని కే.లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందిన రెండు డోలమైట్ క్వారీల్లో( సర్వే నంబర్ 328, 728) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్వారీల్లో డోలమైట్ తవ్వకం జరిగిన తీరు, మైన్స్ శాఖ నుంచి క్వారీలకు పొందిన అనుమతులు, అనధికారికంగా ఎంత విస్తీర్ణంలో మినరల్స్ తవ్వి అమ్మారు తదితర అంశాలపై సంబంధిత శాఖ నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా కొలతలు తీసి యజమానికి నోటీసులు జారీ చేశారు. అలాగే పన్ను ఎగవేతను మదింపు చేసి సంబంధిత శాఖలకు తదుపరి చర్యల నిమిత్తం నివేదికను పంపారు. కాగా ఇటీవల నిర్వహించిన దేశ వ్యాప్త విజిలెన్స్ అవగాహన వారోత్సవాల అనంతరం ప్రాంతీయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు కొనే ఎరువులు, విత్తనాలకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే నకిలీవి విక్రయిస్తున్నా, తయారు చేస్తున్నా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి ఇతర రైతులు నష్టపోకుండా చూడాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎల్‌ఎస్ స్లాబ్స్, ఇసుక టిప్పర్లు, సిమెంట్, గ్రానైట్ రవాణా చేస్తున్న 12 లారీలను తనిఖీలు చేసి సీజ్ చేశారు. కనిగిరి, ఎగుమర్రి, ప్రకాశం జిల్లా నుంచి తాడిపత్రికి, కర్నూలు జిల్లా నుంచి తాడిపత్రికి జీరో బిల్లులు, తక్కువ బిల్లులు, బిల్లులు లేకుండా గ్రానైట్, తదితరాలు రవాణా చేస్తున్న లారీలను సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు. అక్రమంగా గ్యాస్‌ను సిలిండర్లలో భర్తీ చేస్తుండటం, గ్యాస్ ఏజెన్సీల్లో రికార్డులకు భౌతిక సంఖ్యకు తేడా ఉండటంపైనా నిఘా ఉంచి సిలిండర్లు, రెగ్యులేటర్లు తదితరాలను సీజ్ చేస్తున్నారు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్న అక్రమార్కులు అధికారులు ఎపుడు, ఎక్కడ తనిఖీలు చేస్తారోనన్న ఆందోళనకు గురవుతున్నారు.