అనంతపురం

గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఎస్కిలేటర్‌ర్లు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, నవంబర్ 16 : గుంతకల్లు రైల్వేస్టేషన్ నూతన భవనం నుంచి 2,3,4,5,6,7 ప్లాట్‌ఫారాలకు అనుసంధానం చేస్తూ ఎస్కిలేటర్లు ఏర్పాటు చేయాలని డీఆర్‌యూసీసీ సభ్యుడు కొలిమి శేఖన్న డిమాండ్ చేశారు. గుంతకల్లు డీఆర్‌ఎం విజయ్‌ప్రతాప్‌సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డీఆర్‌యూసీసీ సభ్యుల సమావేశంలో గుంతకల్లు డివిజన్ కేంద్రంలో నెలకొన్న సమస్యలను సభ్యులు డీఆర్‌ఎం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్ బుకింగ్ కార్యాలయం నుంచి 2,3,4,5,6,7 ప్లాట్ ఫారాలకు వెళ్లాలంటే మహిళలు, వృద్ధులు ఫుట్‌ఓవర్ వంతెన మీద వెళ్లాల్సి వస్తోందన్నారు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఇందుకు స్పందించిన డీఆర్‌ఎం ఎస్కిలేటర్, లిఫ్ట్‌ల నిర్మాణం పనులు సాగుతున్నాయని, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. అలాగే తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్‌లో రోజురోజుకూ రద్దీ అధికం అవుతోందన్నారు. అయితే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఫుట్‌ఓవర్ వంతెన నిర్మించాలని కోరారు. హనుమాన్ హల్ట్ స్టేషన్‌లో కనీసం లైట్లు లేవన్నారు. కసాపురం హల్ట్ స్టేషన్‌ను నారుూబ్రాహ్మణ కాలనీ వద్ద ఏర్పాటు చేసి, పుణ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకు సౌకర్యం కల్పించాలని కోరారు. ఇందుకు డీఆర్‌ఎం స్పందిస్తూ హనుమాన్ స్టేషన్‌లో ఇది వరకే ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశామన్నారు. చీకటిగా ఉన్న ప్రదేశాలను గుర్తించి, మరిన్ని ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తామన్నారు.