అనంతపురం

డిసెంబర్‌లోగా చెరువులకు హంద్రీనీవా నీరివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర/అగళి/రొళ్ళ/గుడిబండ, నవంబర్ 16 : నియోజకవర్గ పరిధిలోని చెరువులన్నింటినీ ఈఏడాది డిసెంబర్‌లోగా హంద్రీనీవా నీటితో నింపాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని ఉక్కడం రంగాపురం నుండి రొళ్ల, అగళి, అమరాపురం, గుడిబండ మండలాల గుండా హంద్రీనీవా కాలువను పరిశీలిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శ్రీశైలం సమీపంలోని మారాల నుంచి హంద్రీనీవా కాలువ మీదుగా పాదయాత్ర నిర్వహించి జీడిపల్లి వరకు నీటిని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సకాలంలో చెరువులకు నీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నష్టపోయారన్నారు. హంద్రీనీవా నీరు వచ్చి ఉంటే జిల్లా సస్యశ్యామలమై ఉండేదన్నారు. వెంటనే ప్రభుత్వం హంద్రీనీవా కాలువ పనులను వేగవంతం చేసి డిసెంబర్ చివరి నాటికి రైతులకు సాగునీరందించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారంతో పాటు బీమా పరిహారం కూడా అందజేశామన్నారు. జిల్లాలో వివిధ తాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట్ల రోజూ ప్రజలకు తాగునీరు అందిస్తున్నారని, అయితే శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం సక్రమంగా నిర్వహించని కారణంగా తాగునీరు కూడా అందడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసి కూలీలు వలసలు వెళ్లకుండా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరవుప్రాంతాలకు అవసరమైన నిధులను మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.