అనంతపురం

‘గజ’ ప్రభావంతో వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 16 : తమిళనాడులో బీభత్సం సృష్టిస్తున్న ‘గజ’ తుపాను ప్రభావం జిల్లాపైనా పడింది. కోస్తాంధ్ర, రాయలసీమలోనూ తుపాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం కురిసింది. జిల్లాలోని 63 మండలాల్లో 30 మండలాల్లో 2.5 మి.మీ. మేరకు వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో జల్లులు, తుంపర్లు పడ్డాయి. దీంతో 1.2 మి.మీ. సగటు వర్షపాతం నమోదు కాగా, ధర్మవరంలో అత్యధికంగా 1.8 మి.మీ. నమోదైంది. పెద్దవడుగూరులో 12.0 మి.మీ., పెనుకొండ 5.5, పామిడి 4.7, చిలమత్తూరు 5.2, వజ్రకరూరు 3.7 మి.మీ.చొప్పున వర్షం కురినట్లు అధికారిక సమాచారం.

నేడు ‘పురం’ టీడీపీ కొత్త దూత రాక
* బీకేతో సహా నేతలతో మంతనాలు
హిందూపురం, నవంబర్ 16 : స్వయానా నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకుల నడుమ విభేదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్యపై కూడా చిలమత్తూరు ఎంపీపీ వర్గంతోపాటు తదితర నాయకులు బాహాటంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన సీనియర్ టీడీపీ నేత శ్రీనివాసరావును హిందూపురం నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తగా అధిష్ఠానం పంపిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారధితోపాటు శ్రీనివాసరావు మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంతో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఇక్కడి పార్టీ పరిస్థితిపై అటు పీఏ వీరయ్యతోపాటు కొందరు సీనియర్ నాయకులతో మంతనాలు జరిపి అనంతరం మండలాల వారీగా సమీక్ష నిర్వహించి అంతర్గత కలహాలపై చర్చించారు. శ్రీనివాసరావు హిందూపురంలోనే మకాం వేసి పార్టీని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఆర్‌డీటీ సంస్థ జిల్లాకు వరం
* మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, నవంబర్ 16 : ఆర్‌డీటీ సంస్థ జిల్లాకు గొప్ప వరమని మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం స్థానిక బుడ్డప్పనగర్‌లోని బాలసదన్ ప్రాంగణంలో రూ.కోటితో నిర్మించిన అనే్న ఫెర్రర్ శిశుగృహ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో బాలసదన్ ప్రాంగణంలో అనాథ పిల్లల సంక్షేమ కోసం ఆర్‌టీడీ ముందుకు వచ్చి కోటి రూపాయలతో భవనాన్న నిర్మించడం హర్షణీయమన్నారు. తల్లిబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శిశుగృహంలో 0-6 సంవత్సరాల్లోపు అనాథ బాలలు, వదిలేసిన పిల్లలు, అప్పగించిన పిల్లల కోసం 2006 సంవత్సరం నుంచి జిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోందన్నారు. అంగన్‌వాడీల ద్వారా చిన్నారులు, మహిళలకు అందిస్తున్న పౌష్టికాహారంలో లోపాలు ఉండే సహించేది లేదని ఏంతటీవారైనా సస్పెండ్ చేస్తామని తెలిపారు.