అనంతపురం

ప్రభుత్వ కార్యాలయాలకు ఎలక్ట్రిక్ కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 16 : జిల్లాలో త్వరలో విద్యుత్ బ్యాటరీలతో చార్జింగ్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు(ఈ-వెహికల్స్) రోడ్డెక్కనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నెడ్‌క్యాప్ అధికారులు, సంబంధిత శాఖలు, కార్ల కంపెనీల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ-వెహికల్స్‌ను వినియోగంలోకి తెస్తోంది. తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ వెర్షన్లతో నడిచే కార్ల స్థానంలో విద్యుత్ కార్లను వినియోగించబోతున్నారు. సాధారణ కార్లలో మాదిరిగానే వన్ ప్లస్ ఫోర్ సీటింగ్‌తో సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేసిన విద్యుత్ కార్లు అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా జిల్లాలో ఈ-వెహికల్స్ తరం ప్రారంభం కానుందనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ ఈ-వెహికల్స్‌ను వినియోగంలోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నెడ్‌క్యాప్ సంస్థ, ఈఈఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు మహీంద్ర వెరిటో, టాటా టిగోర్ ఈ-కార్లను ప్రభుత్వ శాఖలకు అందించనున్నారు. ఒక్కొక్కటి రూ.12 లక్షలు విలువ చేసే ఈ రెండింటిలో ఏది కావాలంటే దానిని ఎంచుకున్నట్లయితే నెల రోజుల్లో సరఫరా చేస్తారని అధికారిక సమాచారం. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో అద్దె కార్లు వినియోగిస్తున్న ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, యూనివర్సిటీలకు వీటిని సరఫరా చేయడానికి నెడ్‌క్యాప్, ఈఈఎస్‌ఎల్ సంస్థలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, కాకినాడలో ఈ వాహనాల వినియోగానికి కార్లను తెప్పిస్తుండగా, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 1.5 టన్నుల బరువు ఉండే ఈ కార్లను వినియోగించేందుకు రోజుకు 18 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. తద్వారా నెలకు కేవలం రూ.6,500 నుంచి రూ.7000 వరకు మాత్రమే విద్యుత్ ఖర్చు వస్తుంది. ఈ కార్లను ఏసీ చార్జింగ్ ద్వారానూ, ఐదారు కార్లకు కలిపి డీసీ చార్జింగ్ ద్వారానూ చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే 100 కి.మీ. నుంచి 110 కి.మీ. వరకు ప్రయాణం చేయవచ్చు. కాగా ఈ-కార్లు నడిపేందుకు డ్రైవర్లకు ఒక గంట ఆయా కంపెనీలు శిక్షణ ఇస్తాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే అద్దె కార్ల వినియోగిస్తున్న అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు యూనివర్సిటీలకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరులోగా సంబంధిత అధికారులు తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉందని నెడ్‌క్యాప్ జనరల్ మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు. అనంతరం నెల రోజుల్లో ఈ-వెహికల్స్‌ను కంపెనీలు ఇస్తాయని పేర్కొన్నారు. కాగా అద్దె కార్లకు నెల వారీ రూ.35వేల నుంచి రూ.40వేల వరకు చెల్లిస్తున్న ప్రభుత్వ శాఖలకు, అదే తరహాలో నెలకు రూ.20వేల అద్దె ప్రాతిపదికన (లీజ్ ఎండార్స్‌మెంట్) ఆరేళ్ల కాల వ్యవధితో, మూడేళ్లు నాన్-టెర్మినేటింగ్ విధానంలో కంపెనీలే నిర్వహణ బాధ్యతలు తీసుకుని కార్లను సరఫరా చేస్తాయి. విద్యుత్ బ్యాటరీలతో నడిచే ఈ-కార్లను 3-3.30 గంటల్లో చార్జింగ్ చేయవచ్చు. అధిక సామర్థ్యంతో ఉన్న చార్జింగ్ స్టేషన్లలో అయితే గంట-గంటన్నరలోగానే చార్జ్ చేసుకోవచ్చు. తద్వారా 100 కి.మీ. వరకు సునాయాసంగా ప్రయాణం చేసే వీలుంది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణ, అద్దె భారం తగ్గింపు, శబ్ద కాలుష్యం నివారణకు ఈ-వెహికల్స్ దోహదపడుతాయి. పరిమిత దూరం వరకే ప్రయాణించే వీలున్నందున ఎస్‌పీడీసీఎల్, అహుడా, పుడా, ఎస్‌కేయూ, జే ఎన్‌టీయూ, సత్యసాయి యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు వంటి సంస్థల్లో వినియోగించుకోవచ్చు. కాగా భవిష్యత్‌లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలకు కూడా అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
త్వరలో సీఎం జిల్లా పర్యటన
* నగరంలో ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన

అనంతపురం, నవంబర్ 16 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ తెలిపారు. సీఎం రెండు రోజుల పర్యటన అధికారికంగా ఖరారు కానుందన్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా నగర పరిధిలోని పలు ప్రాంతాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. తొలుత నగర నుంచి ఉరవకొండ వెళ్లే మార్గంలో ఉన్న ఎంజీ ఆర్ ఫంక్షన్ హాలు, అక్కడి నుంచి గుత్తి రోడ్డులోని శ్రీసెవెన్ కనె్వన్షన్ హాలు, నగరంలోని కమ్మభవన్ హాలును పరిశీలించారు. అనంతరం శిల్పారామంలో హెలిపాడ్‌కు అవసరమైన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సీ ఎం పర్యటనలో భాగంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుందని, అందులో భాగంగా ముందస్తు ఏర్పాట్ల కోసం నగరంలోని వివిధ ఫంక్షన్ హాళ్లను పరిశీలించామని అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాహనాల పార్కింగ్ నిమిత్తం ఆయా ప్రదేశాలు చూశామన్నారు. నగరంలో అన్ని రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, పట్టణాన్ని సుందరీకరించే పనులు చేపట్టాలని మున్సిపల్ కమీషనర్, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎస్‌వీ.సుబ్బారెడ్డి, ఆర్డీ ఓ మలోల, మున్సిపల్ కమీషనర్ పీవీవీఎన్ మూర్తి, అనంతపురం తహశీల్దార్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.