అనంతపురం

పార్టీ బలోపేతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, నవంబర్ 17 : నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జి పావులూరు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం పట్టణానికి చేరుకున్న ఆయన స్థానిక ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై తనను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఇక్కడే మకాం వేసి మీతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ఇందుకు ప్రతి కార్యకర్త సహకరించాలన్నారు. ఏమైనా అసంతృప్తులు ఉన్నా చర్చించుకుందామన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్రంలోనే నియోజకర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ సాగు, తాగునీటి పథకాల పూర్తికి కంకణం కట్టుకున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి ఎమ్మెల్యే నివాసం చేరుకుని శ్రీనివాసరావుతో చర్చలు జరిపారు. వచ్చే జనవరి దాకా నిరవధికంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా కాలువల ద్వారా పెనుకొండ, హిందూపురం, మడకశిర చెరువులకు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి ఎంతో ఉందని వివరించారు.
మాజీ ఎమ్మెల్యేలు, నేతల నివాసాలకు ఇన్‌చార్జి
స్థానిక మాజీ ఎమ్మెల్యేలు సీసీ వెంకట్రాముడు, పామిశెట్టి రంగనాయకులు, అబ్దుల్‌ఘనీ, టీడీపీ సీనియర్ నేతలు అంబికా లక్ష్మీనారాయణ, జేఈ వెంకటస్వామి, మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి ఇళ్లకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసరావు స్వయంగా వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఆయా నేతల ఇళ్లకు పయనమయ్యారు.