అనంతపురం

సీబీఐ అంటే ఎదుకు దడ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, నవంబర్ 17 : సీబీఐ అంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకు అంత దడ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీజేపీ ఉపాధ్యక్షుడు తిరంపురం లక్ష్మయ్య నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమాలు జరగకపోతే సీబీఐ అంటే ఎదుకు భయపడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ‘గుమ్మడికాయ దొంగ అంటే.. భుజాలు చూసుకున్నట్లు’ ఉంది అని ఎద్దేవా చేశార. తాగు, సాగునీటి కోసం భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా, ఇసుక మాఫియాలపై, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఈనెల 20న జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆయుస్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయక పోవడం వల్ల పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. నోట్ల మార్పిడిపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం మంచిది కాదన్నారు. అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించి మూడు సంవత్సరాలు అవుతున్నా అధికార పార్టీ, ఎమ్మెల్యేల ఒత్తిడి వల్ల ముందుకు సాగడం లేదన్నారు. వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్నారు.

బుక్కపట్నం చెరువులో
బోటింగ్‌కు సర్వం సిద్ధం
కొత్తచెరువు, నవంబర్ 17: ఇటీవల బుక్కపట్నం చెరువులో జల హారతి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు బుక్కపట్నం చెరువు త్వరలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యంగా పుట్టపర్తి సమీపంలో బుక్కపట్నం చెరువు ఉండడంతో భగవాన్ సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించడానికి వచ్చే విదేశీయులు సైతం బుక్కపట్నం చెరువు అందాలను తిలకిస్తున్నారు. చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటుచేస్తే పర్యాటకులు సైతం వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రస్తుతం రెండు బోట్లను శనివారం బుక్కపట్నం చెరువు దగ్గరకు తీసుకువచ్చారు. కలెక్టర్ వీరపాండ్యన్ సైతం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా త్వరలోనే బుక్కపట్నం చెరువు పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.