అనంతపురం

నేడు సత్యసాయి వేడుకలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 17 : భగవాన్ సత్యసాయి బాబా 93వ జయంతి వేడుకలు నేటి నుంచి లాంఛనంగా ప్రారంభమవుతున్నాయి. ప్రతి యేటా నవంబర్ 18వ తేదీన వేణుగోపాల్‌స్వామి రథోత్సవంతో ఈ వేడుకలు ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు. సాయి భక్తుల వినతి మేరకు సాయి సత్యనారాయణ వ్రత పూజలు, రథోత్సవాలకు ప్రప్రథమంగా సత్యసాయి ట్రస్టు శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయి మహాసమాధి వద్ద వేద పఠనం, మంత్రోచ్ఛారణలు, సాయి సత్యనారాయణ ఆరాధన పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. అనంతరం ఈశాన్య గోపురం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వేణుగోపాలస్వామి రథంపై వేణుగోపాలస్వామి సహిత ఉత్సవమూర్తుల విగ్రహాలను ఉంచుతారు. తేరు ముందు ప్రత్యేక పల్లకీపై శ్రీ హనుమంతుని ఉత్సవ విగ్రహం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. డప్పులు, మేళతాళాలు, పండర భజనలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ సత్యసాయి ట్రస్టు పరివారం, గ్రామస్థులు, దేశ, విదేశీ సాయి భక్తులు ముందుకు సాగుతూ రథోత్సవాన్ని ఆరంభిస్తారు. పురవీధులు, పచ్చటి తోరణాలు, రంగుల రవలులు, పుష్పాలంకరణలతో ఇప్పటికే శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులు స్వామివారికి కాయా కర్పూరం సమర్పించుకుని గ్రామంలోని హనుమాన్ సర్కిల్ వద్ద పెద వెంకమరాజు కల్యాణమండపం వరకు ఈ రథోత్సవం సాగుతుంది.
సత్యసాయి జయంతి వేడుకలు ఇలా..
ఆదివారం వేణుగోపాల స్వామి రథోత్సవం, 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20, 21న ఆధ్యాత్మిక సమ్మేళనం, లివింగ్ విత్ సత్యసాయి, ప్రార్థన, పరమార్థం, ప్రముఖుల ప్రసంగాలు, 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 37వ స్నాతకోత్సవం, 23న భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు, ఉదయం గురువందనం, బాబా పూర్వ ప్రసంగాలు, సత్యసాయి ట్రస్టు వార్షిక నివేదిక, ప్రముఖుల ప్రసంగాలు, అదేరోజు సాయంత్రం స్వర్ణ రథోత్సవం, జోల సేవ, 24న కృతజ్ఞత పూర్వక కార్యక్రమాలతో జయంతి వేడుకలు ముగుస్తాయి. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు అశేష భక్తజనం కోసం ఉచిత అన్నదాన, నారాయణసేవ కార్యక్రమాన్ని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు పలువురు దేశ విదేశీయులు పాల్గొంటున్నట్లు ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అటు ట్రస్టు, ఇటు ప్రభుత్వం నిమగ్నమయ్యాయి.
బాలయ్య ముహూర్తమా..మజాకా...!
* అరగంట పాటు రహదారిపైనే నూతన దూత * పూజలు చేసి కార్యాలయంలోకి...
హిందూపురం, నవంబర్ 17 : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నట్లు మరోసారి రుజువైంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన గుంటూరుకు చెందిన పావులూరు శ్రీనివాసరావు ప్రప్రథమంగా శనివారం ఇక్కడికి విచ్చేయడంతో మధ్యాహ్నం 2.20 గంటలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే నివాసంలోకి అడుగు పెట్టాలని బాలకృష్ణ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు మార్గాన శ్రీనివాసరావు మధ్యాహ్న 1.50 గంటలకు హిందూపురంలోకి ప్రవేశించారు. అయితే ఎమ్మెల్యే నిర్దేశించిన సమయం ఇంకా అరగంట ఉండటంతో ఎమ్మెల్యే పీఏ వీరయ్యకు ఫోన్ చేయగా ఆయన హుటాహుటిన ఎమ్మెల్యే నివాసం నుంచి శ్రీనివాసరావు ఉన్న చోటికి వెళ్లారు. మధ్యాహ్నం 2.15 గంటల దాకా రోడ్డుపైనే వాహనాలను ఉంచి ముహూర్త సమయం కోసం వేచి ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి నివాసానికి వచ్చి ఎమ్మెల్యే నిర్దేశించిన సమయానికి లోపలికి వెళ్లారు. పూజలు చేసి కార్యాలయంలోకి అడుగు పెట్టారు.