అనంతపురం

బీసీలు ఐక్యంగా ఎదగాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, డిసెంబర్ 9 : బీసీలు ఐక్యంగా ఎదగాలని మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. కనకదాసు జయంతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బోయలు, కురుబలు నాయకుల తలరాతలు శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. కనకదాసు, వాల్మీకి జయంతి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించి సెలవు దినాలు ప్రకటించాలన్న సంఘాల ఒత్తిడిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో శుభవార్తే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో 50 శాతం ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు కేటాయించిన ఘటన టీడీపీ, ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. పది సంవత్సరాలుగా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎంపీగా, ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా ఎదిగానంటే టీడీపీ ఘనతే అన్నారు. ఈ విషయాన్ని బీసీలు మరువకూడదన్నారు. బీసీలు, కురుబలకు ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాలని ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఇకపోతే నియోజకవర్గంలో అర ఎకరా స్థలాన్ని కేటాయించి రూ.25లక్షలతో బీసీ కమ్యూనిటి హాల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బొమ్మనహాల్ మండలంలో రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మించామని త్వరలో ప్రారంభిస్తామన్నారు. కురుబలు సౌమ్యులు, కష్టజీవులు, ఇతరుల సొమ్ముకు ఆశపడనివారు అన్నారు. బొమ్మనహాల్ మండలానికి రిజర్వాయర్ నిర్మించాలని, బీటీపీకి నీరు తేవాలని, పెనుకొండకు కియా కార్ల పరిశ్రమ కావాలని ఎమ్మెల్యే పార్థసారధి, తాను అన్నదమ్ములా పోరాడి సాధించామన్నారు. తమ పోరాటాలు చూసి ఓర్వలేకే కొంతమంది నాయకులు బురదజల్లేందుకు కృషి చేస్తున్నారన్నారు. వారిమాటలను నమ్మకుండా టీడీపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాష్టస్థ్రాయి ఖోఖో పోటీలు ప్రారంభం
రాప్తాడు, డిసెంబర్ 9 : ఖోఖో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మొదటిస్థానం సంపాయించాలని క్రీడా విద్యార్థులకు మంత్రి పరిటాల సునీత సూచించారు. రాప్తాడులో ఆదివారం ఘనంగా 64వ స్కూల్ గేమ్స్ రాష్టస్థ్రాయి అండర్-14 సీఎం కప్ 2018 ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పరిటాల సునీత, ఎంఎల్‌సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ క్రీడలతోనే విద్యార్థులకు మానసిక ఉల్లాసం దక్కుతుందని, విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ, క్రీడలపై ఆసక్తి పెంచుకుని వాటిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని విద్యార్థులతో పేర్కొన్నారు. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో రాష్టస్థ్రాయి ఖోఖో పోటీలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని, అన్ని జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు, పీఈటీలకు గ్రామస్తులు అన్ని సదుపాయాలు కల్పించి ఆదరించాలన్నారు. రాప్తాడులో స్టేడియంకు రూ.25 కోట్లు నిధులు మంజూరయ్యాయని, వెంటనే నిధులు వెచ్చించి స్టేడియంను ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు మంత్రి తెలిపారు. అనంతరం ఎంఎల్‌సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో రాణించి గ్రామాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మంచి జట్టును ఎంపిక చేసి జాతీయ స్థాయిలో బెంగళూరులో జరిగే ఖోఖో పోటీలలో మొదటిస్థానం సాధించాలన్నారు. అనంతరం క్రీడా మైదానంలో మంత్రి, ఎంఎల్‌సీలు పోటీలను ప్రారంభించారు.