అనంతపురం

లక్ష్య సాధనకు మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 11 : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు చేపట్టిన పక్కా గృహాల నిర్మాణంలో లక్ష్యాన్ని చేరుకోవడం గగనంగా మారుతోంది. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు పరుగులు తీస్తున్నారు. అయినా గ్రౌండింగ్ చేసిన గృహాల్లో 31 శాతానికి మించి పూర్తి కావడం లేదు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సిబ్బంది (వర్క్ ఇన్‌స్పెక్టర్లు) కొరతతోపాటు అధికారుల పర్యవేక్షణకు ఇబ్బందులు తలెత్తుతుండటం, లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందకపోవడం, ఆర్థిక భారం వెరసి లక్ష్య సాధన కష్టసాధ్యంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాలతోపాటు 2016-17 సంవత్సరం లక్ష్యాలను కూడా పూర్తి చేసేందుకు అధికారులు గ్రామాలు, పట్టణాల బాట పట్టారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరైన గృహాలతోపాటు ప్రీ ఎన్‌టీఆర్ పథకాలకు సంబంధించి నిధుల కొరతతో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీ.సెల్వరాజ్ క్షేత్రస్థాయి ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్షిస్తున్నారు. గ్రౌండింగ్ అయిన గృహాల్లో గరిష్టంగా పూర్తికాకపోవడానికి కారణాలను ఆరా తీస్తున్నారు. అహుడా పరిధిలో నూతనంగా 35 వేలు గృహాలు, అనంతపురం రూరల్‌కు 4 వేల గృహాలు అదనంగా మంజూరయ్యాయి. వీటిని కూడా గ్రౌండింగ్ చేసి పూర్తిచేయడంలో పడరాని పాట్లు తప్పడం లేదు. 2014 నుంచి 2019-20 వరకు జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, పెనుకొండ హౌసింగ్ డివిజన్ల పరిధిలో మొత్తం 1,56,110 గృహాలు కేటాయించగా, అవన్నీ మంజూరయ్యాయి. వీటిలో ఎన్‌టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 92,578, పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్ యోజన)-ఎన్‌టీఆర్ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మరో 63,532 గృహాలు మంజూరయ్యాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) ఎన్‌టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 19,250 గృహాలను ప్రభుత్వం కేటాయించగా, 18,881 (98 శాతం) గృహాలకు అనుమతులు మంజూరు అయ్యాయి. వీటికి రూ.288.75 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిలో ఆన్‌లైన్‌లో నమోదైన వివరాల మేరకు 14,730 (78 శాతం) గృహాలను ప్రారంభించగా, 31 శాతం అంటే 5,845 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 4,151 ఇళ్లను ప్రారంభించాల్సి ఉండగా, 13,036 గృహ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. పురోగతిలో ఉన్న 5,516 గృహాలకు 69.13 కోట్లు బిల్లులు చెల్లింపులు జరిగాయి. అర్బన్ గృహ నిర్మాణాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎంఏవై-ఎన్‌టీఆర్ పథకం కింద మున్సిపాలిటీల (యుఎల్‌బీ) పరిధిలో 4,917 గృహాలు కేటాయించగా, 1,877 మంజూరయ్యాయి. వీటిలో కేవలం 304 గృహాలు (16 శాతం) గ్రౌండింగ్ కాగా, 28 గృహాలు ( ఒక శాతం) వరకే పూర్తయ్యాయి. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి (అహుడా) పరిధిలో 35.225 గృహాలు కేటాయించగా కేవలం 345 ఇళ్లకు మాత్రమే ఇప్పటి వరకు పరిపాలనాపరమైన అనుమతులు లభించడం గమనార్హం. అహుడా పరిధిలో రూ.895.55 కోట్లు గృహ నిర్మాణాలకు ఖర్చు చేస్తారు. అయినా ఈ గృహాలు ఇంకా ప్రారంభం కాకపోవడం విశేషం. అలాగే 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌టీఆర్ గ్రామీణ గృహ పథకం కింద 17,400 గానూ 17,194 గృహాలు పూర్తి చేసి 99 శాతం అధిగమించారు. అలాగే 2017-18కి సంబంధించి 18,548 గృహాలు మంజూరు కాగా, 15.448 గృహాలు (83 శాతం) ప్రారంభం కాగా, 10,278 ఇళ్లు పూర్తి (55 శాతం) అయ్యాయి. 2016-17లో పీఎంఏవై-ఎన్‌టీఆర్ గ్రామీణ పథకం కింద 1322 ఇళ్ల మంజూరు కాగా, 1226 ఇళ్లు ప్రారంభించినా, 990 మాత్రమే పూర్తయ్యాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి అర్బన్ 4,414 ఇళ్లు మంజూరు కాగా, 3.496 మాత్రమే పూర్తయ్యాయి. అలాగే 2017-18 సంవత్సరానికి 14,924 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 5,934 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 9 దశల్లోనూ 1,45,910 గృహాలు కేటాయింపు జరిగింది. వీటిలో 78,502 మంజూరు కాగా, 62,551 ఇళ్ల నిర్మాణాలకు గానూ 43,767 ఇళ్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రాజకీయ జోక్యం, మెటిరియల్ సరఫరా, బిల్లులు చెల్లింపు వంటి సమస్యల్ని అధిగమించకుండా పాత, కొత్త గృహాల నిర్మాణాలు ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి కావడం అసాధ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.