అనంతపురం

కేంద్ర పథకాలను టీడీపీ పథకాలుగా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 13: కేంద్రంలోని బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో టీడీపీ పేర్లు మార్చుకుని ప్రచారం చేసుకోవడం చాలా దారుణమని బీజైవైఎం నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గురువారం ఇంటింటా భాజపా కార్యక్రమాన్ని నగరంలోని హౌసింగ్ బోర్డునందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలని ప్రజలు విన్నవించుకుంటున్నారని తెలిపారు. అనంతరం అసెంబ్లీ కన్వీనర్ అమర్‌నాథ్ మాట్లాడుతూ నరేంద్రమోదీ రాష్ట్భ్రావృద్ధి కోసం అనేక నిధులు ఇస్తున్నారని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరియైన పద్దతిలో వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. భాజపా ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సహాయం, చేసిన అభివృద్ధి ఒక కరపత్రం రూపంలో ప్రజలకు ఇచ్చి వారికి వివరించి పార్టీని రాబోయే రోజుల్లో బలోపేతం చేసి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మందుకుపోవాలని పిలుపునిచ్చారు. అనంతరం భాజపా కరపత్రాలు ఇస్తూ, నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజలలో చైతన్యం కల్పించారు.
ఉపాధ్యాయ దీర్ఘకాలిక సమస్యలు
పరిష్కరించండి
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: జిల్లాలోని ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్‌టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీంద్రబాబు, జయరాంనాయక్‌లు కోరారు. ఈమేరకు గురువారం డీఈఓను కలసి ఎన్‌టీఏ నాయకులు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2002 ఆన్‌ట్రైన్డ్ టీచర్స్ సర్వీస్ ప్రొహిబిషన్ డిక్లరేషన్, రెగ్యులరైజేషన్ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని, పండిట్, పీఈటీల పదోన్నతులు అర్హులైన ఎస్జీటీల జాబితాను విడుదల చేయాలని, పెండింగ్‌లోని మెడికల్ బిల్లులను విడుదల చేయాలని, నెలవారి పదోన్నతులు ఇవ్వాలని కోరారు.

హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వాలి
* సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
అనంతపురం, డిసెంబర్ 13: హెచ్చెల్సీ ఆయకట్టు కింద వేసిన పంటలకు నీళ్లు ఆపేయడం దుర్మార్గమని, ఆయకట్టు కింద ఉన్న పంటలకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాకు ఏకైక సాగునీటి వనరు అయిన హెచ్చెల్సీ ఆయకట్టు కింద శింగనమల నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారన్నారు. తుంగభద్రకు ఈ యేడు అధికంగా నీరు రావడంతో హెచ్చెల్సీకి నీరు వదులుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతులు ఆశతో పంటలు సాగుచేశారన్నారు. జనవరి 15 వరకు నీరిస్తామన్న అధికారులు ఈ నెల 5వ తేదీ నుండి నీరు నిలిపివేశారన్నారు. రైతులు పంటలు సాగు చేసి, పంట చేతికొచ్చే సమయంలో నీరు నిలిపి వేయడంతో తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు. వెంటనే నీరు వదలాలని లేని పక్షంలో పంట ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15, 16, 17వ తేదీల్లో శింగనమల నియోజకవర్గ గ్రామాల్లో జీపు జాతా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం 18వ తేదీన ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వంటావార్పుతో నిరవధిక ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు.

జయహో బీసీ పోస్టర్ ఆవిష్కరణ
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: ఈ నెల 19వ తేదీన రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించనున్న జయహో బీసీ కార్యక్రమ పోస్టర్‌ను రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత గురువారం నగరంలోని మంత్రి నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గ బీసీ నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గ స్థాయిలో జయహో బీసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో బీసీ సభ ప్రారంభవుతుందన్నారు. సమావేశానికి చేతి వృత్తులు, కుల వృత్తులు, సామాజిక సేవ చేసే వారిని గుర్తించి ఘనంగా సత్కరించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని బీసీలందరూ పాల్గొని ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారుచేయండి
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్‌ఓలు, ఎఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలతో ఓటర్ల జాబితా సవరణ క్లైంలు, ఆక్షేపణలకు సంబందించిన వివరాలను రేపటి లోగా వంద శాతం పరిష్కరించాలని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ ఢిల్లీరావు, జేసీ-2 సుబ్బరాజు, డీఆర్‌ఓ సుబ్బారెడ్డిలతో కలసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోని ఈఆర్‌ఓలు, ఎఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారుచేయాలన్నారు. ఎవ్వరైనా, ఎప్పుడైనా ఓటర్ల జాబితాను పరిశీలించినా ఎటువంటి పొరపాట్లు తావివ్వరాదన్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో క్షేత్రస్థాయి పరిశీలనను జాగ్రత్తగా నిర్వహించి ఓటర్ల జాబితాను అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా అందిన దరఖాస్తులను పరిశీలన సందర్భంగా ఇంటి నెంబర్లు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఓటరు పేరు, చిరునామా తప్పులు లేకుండా చూడాలన్నారు. బూత్ లెవల్ అధికారులు వారి విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. క్లైమ్స్, అబ్జెక్షన్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన వౌలిక వసతులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 3,879 వున్నాయని, 3,453 పోలింగ్ స్టేషన్లకు ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, మిగిలిన 426 పోలింగ్ స్టేషన్లకు ర్యాంపు సౌకర్యం ఏర్పాటుచేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ కేంద్రంనందు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయుచున్నామని తెలిపారు.

పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా
చెరువులకు నీరివ్వాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీరు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీరివ్వాలని కోరుతూ గురువారం సీపీఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో హెచ్‌ఎల్సీ ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ పీఏబీఆర్ కుడికాలువ ద్వారా 49 చెరువులకు నీరు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఉద్యమిస్తామన్నారు. ఉద్యమాల ద్వారానే నీటిని సాధించుకుందామని రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పీఏబీఆర్‌లో నిల్వ ఉన్న నీటిని లేదా రివర్స్ డైవర్షన్ ద్వారా వచ్చే నీటిని కుడి కాలువ ద్వారా చెరువులకు నీరు విడుదల చేయాలన్నారు. చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరగడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. జిల్లాలో కరువు తాండవిస్తోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కరువు సహాయక చర్యలు కోసం అనేక బృందాలను జిల్లాలో పర్యటనలు మాత్రమే చేయించారని, వాటి వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. హంద్రీనీవా ద్వారా కొన్ని చెరువులకు నీరు అందించి అన్ని చెరువులకు నీరు అందించామని ప్రచారం చేసుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి చెరువులను నింపాలని, లేనిపక్షంలో నిరసనలు, ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.