అనంతపురం

లక్ష్మీచెన్నకేశవుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, డిసెంబర్ 14 : జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన చెన్నకేశవపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీన ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. చెన్నకేశవపురానికి చెందిన ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు ప్రతి యేటా లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు 16వ తేదీ ఉదయం 8 గంటలవకు ధ్వజారోహణం, అంకురార్పణ, పూజా కార్యక్రమాలు, సాయంత్రం 4 గంటల నుండి మహాభిషేకములు, పుష్ప ఉత్సవం, ఉయ్యాలసేవ, 17న 8 గంటల నుండి 12 గంటల లోపు పూజా కార్యక్రమాలు, సాయంత్రం సుదర్శన హోమం, స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 18వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి ఉత్తరద్వార ప్రవేశం, ఉదయం 8 గంటల నుండి హోమాలు, పూర్ణహుతి, సాయంత్రం 4 గంటలకు చక్రస్నానం, ధ్వజారోహణ చెన్నకేశవుని ఊరేగింపు,18న అన్నదానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సురభి నాటక సంస్థ శ్రీ విజయ భారతి నాట్య మండలి హైదరాబాద్ వారిచే 3 రోజులపాటు నాటక ప్రదర్శన దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 16వ తేదీన శ్రీకృష్ణ లీలలు, 17వ తేదీ మాయాబజార్, 18వ తేదీన భక్త ప్రహ్లాద నాటకాన్ని వీరు ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాలను పురష్కరించుకుని ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా చెన్నకేశవపురం గ్రామమంతా భారీగా రంగురంగుల దీపాలతో అలంకరించారు. దేవాలయ ఎదుట భాగాన వున్న ఎతె్తైన హనుమాన్ విగ్రహానికి రంగుల దీపాలతో అలంకరించడంతో విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్తలు శ్రీమతి ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు కోరారు.