అనంతపురం

అంబేద్కర్ విగ్రహం విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, డిసెంబర్ 16: అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల సరిహద్దులోని భోగసముద్రం(బుగ్గ) ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారన్న విషయం తాడిపత్రి పట్టణంలో కలకలం రేపింది. దళిత సంఘాల నేతలు భారీగా తరలివచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని నిరసన చేపట్టారు. రూరల్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల మేరకు బుగ్గ కూడలిలో అంబేద్కర్ విగ్రహం దిమ్మను లారీ ఢీకొనడంతో విగ్రహం ధ్వంసమైందని తెలిపారు. కేవలం ప్రమాదవశాత్తు యాదృచ్చికంగా జరిగిన సంఘటనేనని, దుండగులు ఎవ్వరునూ ధ్వంసానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నడుమ రవాణాకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది లారీలు బుగ్గ కూడలి నుంచి తరలివెళ్తాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల లారీలే కాకుండా ఇతర రాష్ట్రాల లారీలు ఆ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. రాత్రివేళలో ఆ కూడలి వద్ద చాలామంది డ్రైవర్లు లారీలు ఆపివేసి నిద్రించి కాసేపు విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2గంటల ప్రాంతంలో గుర్తుతెలియని భారీ ట్రాలీతో కూడిన లారీ మలుపు తీసుకుంటున్న క్రమంలో కూడలిలోనున్న అంబేద్కర్ విగ్రహం దిమ్మకు లారీ తగలడంతో ధ్వంసమైందన్నారు. గస్తీ కానిస్టేబుళ్లు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించానని, అప్పటికే లారీ అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. సీసీ పుటేజ్‌లను పరిశీలించి, లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
దళిత సంఘాల ధర్నా
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేతలు తహశిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహం స్థానంలో నూతన విగ్రహం ఏర్పాటుచేసి, విగ్రహం చుట్టూ కంచె ఎర్పాటు చేయాలని ఇన్‌చార్జ్ తహశిల్దార్ నాగభూషణంకు దళిత సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. ఘటనా స్థలంలో మాల మహానాడు నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.

జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకంలోని
భారీ అవినీతిపై విచారణ చేపట్టండి
* వైకాపా రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య
తాడిపత్రి, డిసెంబర్ 14: జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకంలో కోట్లాది రూపాయల భారీ అవినీతిపై విచారణ చేపట్టాని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య డిమాండ్ చేశారు. స్థానిక తహశిల్దార్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ తహశిల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా పైలా మాట్లాడుతూ జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం ద్వారా రెండు మున్సిపాలిటీలు, 5 నియోజక వర్గాల పరిధిలోని 514 గ్రామాలకు నీరందించేందుకు 508 కోట్లతో ఈ పథకం మంజూరైందని, వందల కోట్లు ఖర్చుపెట్టారు కాని పట్టుమని పది గ్రామాలకు నీరిచ్చే పరిస్థితి లేదన్నారు. ఈపథకంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించ లేదన్నారు. ఈ పథకానికి సంబందించిన పైపులు, మోటర్లు, స్టాటర్లు నాసిరకంగా ఉన్నందున తుప్పుపట్టిపోయాయని తెలిపారు. ఈ పథకం పనులను నాసిరకంగా చేపట్టడం వలన ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. ప్రజా ధనం వందల కోట్లు నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకంలో జరిగిన భారీ స్కాంమీద ఉన్నతస్థాయి విచారణకు, సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నానని తెలిపారు.

ఎస్‌ఐ ఉధ్యోగ అభ్యర్థులూ...
బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి
* ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్
అనంతపురం, డిసెంబర్ 14: ఈ నెల 16న జరిగే ఎస్‌ఐ ఉద్యోగ ప్రిలిమినరీ రాత పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి అని ఎస్పీ జీవీజీ.అశోక్ కుమార్ పేర్కొన్నారు. పరీక్షల ప్రారంభానికి గంట మునుపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వెంట తీసుకురాకూడదని అభ్యర్థులకు సూచించారు. 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని, సుమారు 9 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం జరిగే రెండు పేపర్లకు సంబంధించి బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి అని ఎస్పీ పేర్కొన్నారు. దూరంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండుల్లో పోలీస్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు బ్లూ మరియు బ్లాక్ బాల్ పెన్నులు తెచ్చుకోవాలన్నారు. ఎలాంటి అవకవతవకలు లేకుండా పారదర్శకంగా జరిగే పరీక్షల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే డయల్-100 ద్వారా తెలియచేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

విజిలెన్స్ అధికారుల దాడులు
440 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
లారీతోపాటు ఇద్దరు అరెస్టు
డీ.హీరేహాల్, డిసెంబర్ 14: జిల్లా కేంద్రానికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలోనున్న డీ.హీరేహల్ మండలంలోని జాజురకల్లు గ్రామంలో రేషన్ బియ్యం బస్తాలను కర్నాటకు అక్రమంగా తరలించడానికి లారీలో లోడు చేస్తున్నారని సమాచారం అందుకున్న విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం జాజురకల్లు గ్రామం చేరుకున్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ రామకృష్ణ జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఆదేశాల మేరకు రామకృష్ణ, డీసీటీఓ సుబ్బారెడ్డి, స్థానిక రెవిన్యూ అధికారుల బృందం శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ, అధికారులు విలేఖరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన రామన్న, కర్నాటక ప్రాంతం రాంపురం గ్రామానికి చెందిన రాజశేఖరతో కలసి రేషన్ బియ్యం బస్తాలను కర్నాటక ప్రాంతానికి తరలించి అక్రమ దందాలు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంటిలో అక్రమంగా నిల్వ చేసుకున్న రేషన్ బియ్యం బస్తాలను కర్నాటక ప్రాంతానికి తరలించడానికి సిద్దమయ్యారనే విషయం శుక్రవారం ఉదయం సమాచారం అందింది. రెవిన్యూ, పోలీసుల సమాచారంతో గ్రామానికి వెళ్ళి అక్రమ రవాణాను అడ్డుకున్నామన్నారు. లారీలో ఉన్న 440 రేషన్ బియ్యం బస్తాలు, లారీని, నిందితులు రామన్న, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. పట్టుకున్న బియ్యం లారీని స్థానిక పోలిస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు.