అనంతపురం

స్వచ్ఛ భారత్ పథకాల అమలు తీరుపై కేంద్ర బృందం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, జనవరి 16: స్వచ్ఛ భారత్ పథకం కింద కొత్తచెరువులో నిర్మించిన మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణంపై కేంద్ర బృందం బుధవారం నిశితంగా తనిఖీ చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐఎఎస్ అధికారి ఆనంద్ శేఖర్ బృందం తనిఖీ చేపట్టింది. ఇటీవలే ఈ పథకాలకు సంబంధించి థర్డ్ పార్టీతో కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టగా థర్డ్ పార్టీ ఏ విధంగా విచారణ చేసిందనే దానిపై కేంద్ర బృందం మరోసారి తనిఖీ చేసింది. ఈ సందర్భంగా కొత్తచెరువులోని బసవన్నకట్ట వీధిలో లబ్దిదారుల ఇళ్ల వద్దకు బృందం అధికారి ఆనంద్‌శేఖర్ వెళ్లి నిర్మాణాలను పరిశీలించారు. లబ్దిదారుల నుంచి వివరాలను సేకరించారు.
టీడీపీతోనే బీసీల అభివృద్ధి
* మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, జనవరి 16 : తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సాధ్యమని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రా మారావు మండలాల వ్యవస్థను ఏర్పా టు చేసి పాలనను ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. అంతేగాకుండా బీసీలకు బలమైన వేదికను నిర్మించారన్నారు. అప్పటి నుంచే బీసీల అసలైన రాజకీయ ప్రయాణం ప్రారంభమైందన్నారు. ప్రస్తుత కేబినేట్‌లో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఇందులో భాగంగానే ప్రతి పంచాయతీలో బీసీల భవన్ నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. కాగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణంలో ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని యార్డు నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలోని శాంతినగర్‌లో ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు..
* బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి
ఉరవకొండ, జనవరి 16 : రాబోయో ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్లు విడుదల చేసిందన్నారు. ఆ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలకు పాల్పడి దుర్వినియోగం చేశాడన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏవిధంగా ఖర్చు చేశారన్న వివరాలపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ఈబీసీ రిజర్వేషన్, ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ట్రిపుల్ తలాఖ్ వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు పని దినాలు పెంచారన్నారు. వేలాది పక్కా గృహాలు మంజూరు చేశారన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి రాష్ట్రంలో 12 విద్యాసంస్థలను ప్రారంభించారన్నారు. అయితే ఇవన్నీ చూడని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని విమర్శించడం పనిగా పెట్టుకున్నారన్నారు. ఈనెల 18న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమలోని 8 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన 8వేల పోలింగ్ బూత్ శక్తి కేంద్రాల అభ్యర్థులతో కడపలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.