అనంతపురం

కళలకు ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, జనవరి 16: ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి శిల్పారామంలో రెండవ రోజు సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నానాటికి అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రాచీన కళలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు, నిధులు ఖర్చు చేస్తోందన్నారు. సంక్రాంతి పర్వదినాన శిల్పారామంలో సాంప్రదాయరీతిలో తెలుగుదనం ఉట్టి పడేలా ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడలు, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బెస్త చలపతి, పుడా ఛైర్మన్ కడియాల సుధాకర్‌నాయుడు, శిల్పారామం ఏవో రమేష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షమి, ఉద్యానవన శాఖ అధికారి రాంప్రసాద్, కౌన్సిలర్లు లక్ష్మిదేవి, దిల్షాద్‌బేగ్, చెన్నకృష్ణమ్మ, నాయకులు మహమ్మద్ రఫి, కన్వీనర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ చూపిన సాయి విద్యార్థులకు బహుమతుల ప్రదానం
సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనంలో పాల్గొని ప్రతిభ చూపిన సాయి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సత్యసాయి డ్రీమ్డ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11న నిర్వహించిన సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనంలో వివిధ సాంస్కృతిక క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపిన సాయి విద్యార్థులను అభినందించి బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. మంగళవారం ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద బాబాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వేడుకున్నారు. అనంతరం వైస్ ఛాన్స్‌లర్ కెబిఆర్ వర్మ, రిజిస్ట్రార్ సాయి గిరిధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్‌జె రత్నాకర్, చక్రవర్తి, ప్రసాద్‌రావు, విసికెబిఆర్ వర్మ, రిస్ట్రార్ సాయిగిరిధర్ చేతులమీదుగా విద్యార్థినీ విద్యార్థులకు ట్రోఫీలు, బహుమతులను అందజేశారు. క్రీడా సమ్మేళనాన్ని పురస్కరించుకొని అనంతపురం బృందావనం, ముద్దనహళ్లి, పుట్టపర్తి క్యాంపస్ విద్యార్థులు ఈ ట్రోఫీలను అందుకొని ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అశేష సాయి భక్త జనాన్ని అలరించారు.