అనంతపురం

తాగునీటి కష్టాలు తీర్చేదెవరో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జనవరి 16 : పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలు వేసవికి ముందే తాగునీటి సమస్య ప్రారంభమైనా సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పలు గ్రామాల్లో నీరు ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో నీటి సమస్య నెలకొంది. రొళ్ళ, అమరాపురం, గుడిబండ, అగళి, మడకశిర మండలాల్లో పలుచోట్ల తాగునీటి కోసం ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు. రొళ్ళ మండలంలోని కాకి, రత్నగిరి, వట్టెబెట్ట, అమరాపురం మండలంలో వలస, హల్కూరు, హేమావతి, మడకశిర మండలంలో ఆర్.అనంతపురం, గౌడనహళ్ళి, సీ.కొడిగేపల్లి, గోవిందపురం, గుర్రపుకొండ, అమిదాలగొంది, పట్టణంలోని పలు కాలనీల్లో గత రెండేళ్లుగా నీటి సమస్య నెలకొంది. బోరు బావుల్లో భూగర్భజలాలు అడుగంటాయని, వాటికి అదనపు పైపులు ఏర్పాటు చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొత్త బోర్లు కూడా వేయించకపోవడంతో నీటి సమస్య జఠిలంగా మారిందని పేర్కొంటున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఎపీడీఓలు నీటి సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ట్యాంకర్లను నామమాత్రంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. గతంలో సర్పంచ్‌లు తాగునీటి సమస్య ఏర్పడిన వెంటనే ఏదో ఒక విధంగా నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొనేవారని, ప్రత్యేకాధికారుల పాలనలో నీటి సమస్యను పట్టించుకొనేవారే లేకపోయారు. నగర పంచాయతీలో రహదారుల విస్తరణ పేరిట తొలగించిన పైపులైన్‌లను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెనుకొండ రోడ్డు, పావగడ రోడ్డు, ఆదిరెడ్డిపాళ్యం, శంకరనగర్ కాలనీలో పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. చెరువులో వేసిన బోరులో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్ లేని కారణంగా దాదాపు 20 కాలనీల ప్రజలు ట్యాంకర్‌కు రూ.500 వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు వాపోతున్నారు. పలుచోట్ల వాటర్‌మెన్లు కౌన్సిలర్ల ఇళ్ళకు నీటిని సరఫరా చేస్తున్నారే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధర్నాలు చేసిన సమయంలో సంబంధిత అధికారులు ఆ ప్రాంతాలకు రావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మడకశిర నగర పంచాయతీలో తాగునీటి సరఫరా మెరుగు పరచాల్సిన అవసరం ఉందని గృహ వినియోగదారులు కోరుతున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా వచ్చే నీరు అయితే పట్టణానికి కొంత ఊరట ఇచ్చేదని, ఆ నీరు కూడా ప్రస్తుతం రావడం లేదన్నారు. 28 బీఓటీలకు గాను 4 బీఓటీల్లో మాత్రమే నీరు వస్తోందన్నారు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

హంద్రీనీవాలో తగ్గిన నీటి ప్రవాహం!
* కాలువలో అడ్డంగా పెద్దపెద్ద రాళ్లు * ఈనెల ఆఖరి వరకు నీటి పంపింగ్
ఉరవకొండ, జనవరి 16 : హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోని ప్రధాన కాలువలో అడ్డం పెద్దపెద్దరాళ్లు వేయడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. కాలువలోని 174.600 కిమీ వద్ద బండరాళ్లు వేయడంతో నాలుగు రోజుల నుంచి పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం తగ్గింది. రాగులపాడు వద్ద ఉన్న పంప్‌హౌస్ నుంచి మూడు రోజులుగా మూడు పంపులతో నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని మల్యాల పంప్‌హౌస్ వద్ద సాంకేతిక కారణాల వల్ల 12న పంపింగ్ ఆగిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 13 నుంచి తిరిగి యథావిధిగా నీటి పంపింగ్‌ను ప్రారంభించినట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు తగ్గిపోవడంతో ముచ్చు మర్రి జలాశయం నుంచి మల్యాలకు నీటిని మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి రాగులపాడు లిఫ్ట్‌కు నీటిని మళ్లించి రోజూ 568 క్యూసెక్కులు జీడిపల్లి రిజర్వాయర్‌కు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 18 టీఎంసీల నీటిని మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈనెలాఖరి వరకు నీటి పంపింగ్ చేయవచ్చని అధికారులు అంటున్నారు.