అనంతపురం

పరిటాల రవి వర్ధంతికి పూర్తయిన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జనవరి 23: పరిటాల రవీంద్ర 14వ వర్ధంతిని గురువారం వెంకటాపురం గ్రామంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 8.45 నిమిషాలకే కుటుంబ సభ్యులతో కలసి మంత్రి పరిటాల సునీత పరిటాల రవీంద్ర ఘాట్‌కు నివాళులర్పించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వంట సామగ్రిని అందుకు సంబంధించిన వస్తువులను సిద్ధం చేశారు. ఇప్పటికే వందలాదిమంది అభిమానులు వెంకటాపురంలో ఉండడంతో పూజా కార్యక్రమాలు చేసి భోజన ఏర్పాట్లను ప్రారంభించారు. తరలివచ్చే అభిమానుల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పరిటాల ఘాట్‌ను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఘాట్ అలంకరణకు ప్రత్యేకంగా పూలు రావడంతో వాటిని మంత్రి పరిశీలించి అలంకరణకు పలు సూచనలు జేశారు. మంత్రి వంటశాలకు వెళ్లి దగ్గరుండి ఆకుకూరలు తరుగుతూ అక్కడ పనిచేస్తున్న వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉదయమే జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు వెంకటాపురం చేరుకొని పరిటాల ఘాట్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి పరిటాల సునీతతో ఏర్పాట్లపై మాట్లాడారు. మడకశిర నుంచి వై.టి.ప్రభాకర్‌రెడ్డి, కంబదూరు జడ్పీటీసీ రామ్మోహన్ తదితరులు మంత్రి పరిటాల సునీతతో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిటాల రవీంద్ర దూరమై 14 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయారని పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర అభిమానులను ఈ కుటుంబం ఎన్నటికీ మరువదన్నారు. పరిటాల రవీంద్ర ఆశయాలను చివరి వరకు కొనసాగిస్తామని తెలిపారు. అభిమాన నాయకుడికి అభిమానులందరూ తరలివచ్చి ఘనంగా నివాళులర్పించాలని ఆమె కోరారు.
వర్ధంతి సందర్భంగా పోలీస్ బందోబస్తు...
పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు ఒక డీఎస్పీ, 6 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా రోడ్డు వెంబడి ప్రధాన కూడలి వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.