అనంతపురం

టీడీపీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, జనవరి 23: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. బుధవారం నియోజకవర్గంలోని కనగానపల్లి మండలంలోని తగరకుంట గ్రామ పంచాయతీలోని మంత్రి పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా కనగానపల్లి మండలం తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తగరకుంట పంచాయతీలో రూ.1.25 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్‌లో ఉన్నా గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని, రాష్ట్భ్రావృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని, దీన్ని ప్రజలు గుర్తించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును ఎన్నుకోవాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పూర్తిగా సీసీ రోడ్లు నిర్మించామని, పింఛన్లను ప్రభుత్వం ఐదు రెట్లు పెంచి మళ్లీ ఇప్పుడు రెండింతలు చేయడం ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే ఆ ఘనత చెందుతుందన్నారు. ఫిబ్రవరి 1 నుండి పెంచిన పింఛన్లన్నీ పంపిణీ చేస్తామని, వడ్డీ లేని రుణాలను ఫిబ్రవరి నెలలో రూ.2200 కోట్లు ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతి డ్వాక్రా సంఘంలోని మహిళలకు రూ.10వేలుతోపాటు స్మార్ట్ఫోన్ కూడా అందజేస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మహిళల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అందించలేదని, తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోందన్నారు. చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లాంటి ఎన్నో కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్రం ఇంకా అభివృద్ది చెందాలంటే మళ్లీ తెదేపాకే అవకాశం ఇవ్వాలని మంత్రి తెలిపారు.
మడకశిరలో కృష్ణమ్మ పరవళ్లు
* ఎమ్మెల్సీ గుండుమల జలహారతి
మడకశిర, జనవరి 23 : మండలంలోని సీ.కొడిగేపల్లి పంప్‌హౌస్ వద్దకు బుధవారం కృష్ణాజలాలు చేరుకున్నాయి. దీంతో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి జలహారతి ఇచ్చారు. ఈ ప్రాంతంలోని మణూరు, హరేసముద్రం, మడకశిర చెరువులకు కృష్ణాజలాలను ఈ నెలాఖరుకు కృష్ణాజలాలను అందించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు సాగించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు కృష్ణాజలాలు సీ.కొడిగేపల్లి వద్దకు రావడంతో ఎమ్మెల్సీ, పార్టీ ఇన్‌చార్జి ఈరన్న, నాయకులు, కార్యకర్తలు జలహారతి ఇచ్చారు.
విధుల్లోకి తీసుకోండి మహాప్రభో....
* డ్వామా పీడీ కాళ్లు పట్టుకుని వేడుకున్న ఉద్యోగులు
అనంతపురం, జనవరి 23: డ్వామాలో పనిచేస్తూ ఇటీవల తొలగింపబడిన ఉద్యోగులు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ డ్వామా పీడీ కాళ్లు పట్టుకుని నిరసన చేపట్టారు. తొలగించబడిన ఉద్యోగులు నెల రోజులుగా రిలే దీక్షలతో నిరసనకు దిగారు. వీరికి సీఐటీయూతోపాటు వివిధ సంఘాలు తమ మద్దతును తెలియచేశాయి. నిరసన కార్యక్రమంలో భాగంగా ఇటీవల వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో బుధవారం తమ విధుల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన డ్వామా పీడీ జ్యోతిబసు కారును వారు అడ్డుకున్నారు. దీనితో పీడీ కారు దిగడంతో తమకు న్యాయం చేయాలని, అంతవరకు వదలేది లేదంటూ పీడీ జ్యోతిబసు కాళ్లు పట్టుకున్నారు. వారు ఎంతకూ కాళ్లు వదలకపోవడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బలవంతంగా పక్కకు లాగివేశారు. పీడీ పరుగులు పెడుతూ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఈటె నాగరాజు మాట్లాడుతూ తొలగింపబడిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్వామా పీడీ మాట్లాడుతూ అవసరం మేరకే తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందన్నారు. శాశ్వత ప్రాతిపదికన కొనసాగించే అవకాశం లేదన్నారు.