అనంతపురం

నేడు రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెల్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జనవరి 23 : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పూర్తయిన అభివృద్ధి పనులు రైల్వే మంత్రి సహాయ మంత్రి రాజెన్ గొహెల్ నేడు ప్రారంభించనున్నారు. ఈమేరకు మంత్రి రాక కోసం స్థానిక రైల్వేస్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రైల్వేస్టేషన్ వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో పెద్దఎత్తున 100 అడుగుల పతాకాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ ప్రవేశ ద్వారాలకు ఎదురుగా వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేయడంతోపాటు పచ్చికలతో అద్దిన పార్కు తయారు చేశారు. గుంతకల్లు-నల్లపాడు, గుంతకల్లు-కల్లూరు మధ్య విద్యుదీకరణ, గూళపాల్యం- ఖాదర్‌పేట మధ్య డబ్లింగ్ లైన్, గుంతకల్లు నూతన స్టేషన్ భవనం, గుంతకల్లు, అనంతపురం, కడప, కర్నూలు రైల్వేస్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలను మంత్రి ప్రారంభించనున్నారు. వీటితోపాటు రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేస్తూ గుంతకల్లు-గుంటూరు మధ్య 420 కిలోమీటర్లు రూ.432 కోట్లతో 2012-13లో పనులు ప్రారంభమయ్యాయి. గుంతకల్లు-నల్లపాడు మధ్య రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా రూ.33కోట్లతో గుంతకల్లు-కల్లూరు మధ్య 41 కిలోమీటర్ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ముంబయి, ఢిల్లీ, సికింద్రాబాద్‌లతో అనుసంధానంగా ఉన్న గుంతకల్లు-కల్లూరు మార్గంలో అదనంగా రైల్వేలైన్ ఏర్పాటు పనులు రూ.323 కోట్లతో ప్రారంభమయ్యాయి. కాగా గుంతకల్లు-కల్లూరు, గూళపాల్యం- ఖాదర్‌పేటల మధ్య రైల్వే డబ్లింగ్ లైన్‌లు పూర్తయ్యాయి. వీటితోపాటు గుంతకల్లు, అనంతపురం, కడప, కర్నూలు రూ, 44 లక్షలతో హైస్పీడ్ వై ఫై సేవలు ఏర్పాటు చేశారు. కడప రైల్వే స్టేషన్‌లోని 1వ నెంబర్ ప్లాట్ ఫారంలో లిఫ్ట్‌ను రిమోట్ లింక్ ద్వారా మంత్రి ప్రారంభించనున్నట్లు డీఆర్‌ఎం విజయ్‌ప్రతాప్‌సింగ్, ఏడీఆర్‌ఎం శర్మ తెలిపారు.