అనంతపురం

మూన్నాళ్ల ముచ్చటగా రాత్రి పారిశుద్ధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 3 : హిందూపురంలో రాత్రి పారిశుద్ధ్యం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అధికారులు, నేతల పర్యవేక్షణ లోపం తో అసలు పట్టించుకునే నాథుడే కరు వయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నా యి. పారిశుద్ధ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో హిందూపురం మున్సిపాలిటీ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు చైర్‌పర్సన్ లక్ష్మి పారిశుద్ధ్యం చక్కదిద్దే పనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇంటింటా చెత్తసేకరణతోపాటు ప్రధాన వీధులను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేశారు. ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అనేక చర్యలు చేపట్టారు. చివరకు చెత్త రోడ్లపై వేస్తే జరిమానా విధించేలా కౌన్సిల్ తీర్మానం చేయించారు. ప్రధాన రోడ్లను ఉదయమే శుభ్రం చేయడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి రాత్రివేళల్లో శుభ్రం చేయిస్తే బాగుంటుందని ఆలోచించి రాత్రిపూట ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. శుభ్రం చేసిన చెత్తను వెంటనే తరలించేందుకు ఆటోలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. మొదట్లో ప్రధాన రహదారులను రాత్రి వేళల్లో శుభ్రం చేసే పనులు బాగానే జరిగా యి. అయితే ఇటీవల కొద్దికాలంగా చైర్‌పర్సన్ వ్యక్తిగత కారణాలతో పర్యవేక్షణ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. అంతే... సిబ్బంది పనితీరూ మారిపోయింది. రాత్రిపూట పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకు అధికారులు రావడం లేదు. సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. దీంతో ప్రధాన రహదారులు చెత్తమయంగా మారాయి. తమ షాపుల్లో, చిన్న దుకాణాల్లో తయారయ్యే చెత్తను ప్రత్యేక డబ్బాల్లో వేసుకోవాల్సిన యజమానులు ఏకంగా రోడ్లపైకి వేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులు చెత్తమయంగా కనిపిస్తున్నాయి. రాత్రి పారిశుద్ధ్యం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. దీనికితోడు పందులు, కుక్కలు పట్టణంలో విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని నివారించడంలో పారిశుద్ధ్య విభాగం పూర్తిగా విఫలమైంది. పందుల యజమానులతో చర్చలు జరపడంలోనే రెండేళ్లుగా కాలం గడిపేస్తున్నారు. దీంతో ప్రధాన వీధుల్లో సైతం పందులు, కుక్కలు పెద్ద ఎత్తున సంచరిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కౌన్సిల్ తీర్మానం చేసింది. ఎవరైనా ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానా విధించాలని చైర్‌పర్సన్ ఆదేశించారు. అయితే విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నా నెలకోసారి మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తూ ఒకరిద్దరికి అపరాద రుసుం విధిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల పర్యవేక్షణ పెంచడంతోపాటు పాలకులు కాస్త దృష్టి సారిస్తే 3చెత్త2 హిందూపురం పేరు కొంతైనా మారుతుంది లేదంటే మరోసారి అట్టడుగునే మిగిలే ప్రమాదం ఉంది.