అనంతపురం

ప్రజా సేవలోనే సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, మే 3: ప్రజలకు సేవ చేస్తే వచ్చే తృప్తి ఎనలేనిదని, కావున రాజకీయ నాయకులు ప్రజా సేవకు నడుం బిగించాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మండల టిడిపి కన్వీనర్ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అనంతరం లోచర్ల గ్రామంలో గ్రామస్థులు ఏర్పాటుచేసిన గంగమ్మ జాతరలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మే నెల మొత్తం గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేసి మంచినీరు ప్రజలకు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా రూ.200 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే రూ.10కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో సిమెంటు రోడ్డు లేని రోడ్లు వుండకూడదనే లక్ష్యంతోనే దశలవారీగా సిమెంటు రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదని, రాష్ట్రానికి చెడ్డ పేరు తేవడానికిగాను ఢిల్లీలో మంత్రులను కలుస్తున్నారని ఆయన ఎద్దేవ చేస్తున్నారు. తన ఎమ్మెల్యేలనే నిలుపుకోలేని జగన్ ఇతరులను విమర్శించే అర్హత లేదన్నారు. కేసిఆర్‌తో లాలూచీ పడి రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వాణి, జెడ్‌పిటిసి మహాలక్ష్మి, మండల కన్వీనర్ రమేష్‌నాయుడు, మాజీ కన్వీనర్లు పోలినేని కిష్టప్ప, శ్రీనివాసులు, జిల్లా దేశం కార్యదర్శులు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు దాల్‌మిల్ సూరి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రఘుపతి, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు రవిచంద్ర, టిడిపి నేతలు కేశప్ప, తెలుగురైతు నాయకుడు వైవి.శ్రీరాములు పాల్గొన్నారు.