అనంతపురం

వైభవంగా రాయల ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఫిబ్రవరి 12 : శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ధి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ వీరపాండ్యన్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఉత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాటి రాజుల వైభవాన్ని తలపించే విధంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. ఏ కమిటీలకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. బుధవారం పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద బెలూన్ ఆవిష్కరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కృష్ణదేవరాయల విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. తర్వాత పట్టణం నుంచి కొండపైకి విద్యార్థులు, యువకులతో హిల్ ట్రెకింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యే బీకే పార్థసారధి, కలెక్టర్ వీరపాండ్యన్ ప్రారంభిస్తారన్నారు. అలాగే గురువారం పట్టణంలో ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. రెండు రోజుల పాటు జిల్లాలోని కళాకారులతో ప్రాచీన, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.