అనంతపురం

మోదీ రాజకీయ విలువలను దిగజార్చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 12: దేశంలో ప్రధానిగా నరేంద్రమోదీ రాజకీయ విలువలను దిగజార్చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధులు తెలిపారు. గత పది రోజులుగా సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభను మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల నాయకులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది చంద్రబాబు తెలుసుకుని 9 నెలలుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మూడు నెలల ముందు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డిలు బీసీల జపం చేస్తున్నారని, బీసీలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రజా పాలకుల మోసాలను, అక్రమార్జన, దోపిడీని గుర్తించి ప్రజా సంక్షేమ కోసం పాటుపడే నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజల, కార్మిక, కర్షక కష్టాలను, సమస్యలను తీర్చకుండా కేవలం ఓట్లు దగ్గరపడుతున్నాయని తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి సీటు కోసం ఆరాటం చూస్తే అంతా ఇంతా కాదని, వారి చేసే అక్రమాలకు అడ్డువేయాలంటే మరో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు జనసేన నాయకులు వరుణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలు పట్టకుండా ముఖ్యమంత్రి సీటు కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు, ప్రజల కోసం పనిచేసే ప్రత్యామ్నాయ పార్టీలు సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలను ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు.