అనంతపురం

వెల్లువలా అగ్రిగోల్డ్ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 21 : తమ కష్టార్జితాన్ని కొంచెం కొంచెం కూడబెట్టుకుని, ఆ సొమ్మును పొదుపు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు వాడుకోవాలని ఆశించి దగా పడిన అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాండ్ల పరిశీలనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జిల్లాలోని వేలాది మంది బాధితులు అనంతపురంలోని డీఎల్‌ఎస్‌ఏకు క్యూకట్టారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 19న డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జడ్జి రాధమ్మ అవగాహన కల్పించి, బాధితుల అనుమానాలను నివృత్తి చేశారు. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా బాధితులు వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా మండలాల వారీగా నిర్దేశిత తేదీలను కేటాయించారు. సదరు మండలాల బాధితులు నిర్దేశిత తేదీల్లోనే బాండ్ల పరిశీలనకు రావాలని కార్యదర్శి కోరారు. ఈ మేరకు గురువారం అనంతపురం, బుక్కరాయసముద్రం మండలాలకు చెందిన రూ.10వేల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు ఉన్న బాధితులు వచ్చారు. వీరి బాండ్లను డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జడ్జి రాధమ్మ పరిశీలించి, సిబ్బంది పరిశీలించారు. మొత్తం 120 మంది తెచ్చిన 120 బాండ్లనందు అర్హులుగా ఆదేశాలిచ్చారు.
డిపాజిటర్లు వెంట తేవాల్సినవి..
డిపాజిటర్లు తమ ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండు, ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ పాసుబుక్‌తో పాటు గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి, అలాగే వీటన్నింటిని జిరాక్స్ కాపీలు(నకలు) వెంట తీసుకు రావాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీల్లో ఖాతాదారుడి సంతకం తప్పనిసరిగా ఉండాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి తెలిపారు.
మండలాల వారీగా తేదీలు..
నేడు గార్లదినె్న, నార్పల, రాప్తాడు, కూడేరు, ఆత్మకూరు, 23వ తేదీ శింగనమల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, 25న గుంతకల్లు, గుత్తి, పామిడి, సీకేపల్లి, పెద్దవడుగూరు, 26న విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, బెళుగుప్ప, 27న కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, 28న డీ.హీరేహాల్, కణేకల్లు, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల బాధితులు హాజరు కావాల్సి ఉంది. మార్చి 1న మడకశిర, గుడిబండ, అమరాపురం, రొళ్ల, అగళి, 2వ తేదీ పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం, 5వ తేదీ నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, ఓడీ చెరువు, అమడగూరు, 6వ తేదీ ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, కదిరి, 7న తనకల్లు, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, ఆఖరు రోజు మార్చి 8న హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, రామగిరి, పరిగి, గోరంట్ల మండలాల అగ్రిగోల్డ్ బాధితులు హాజరు కావాల్సి ఉంటుంది.