అనంతపురం

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం, ఫిబ్రవరి 21 : వాహనాల డ్రైవర్లు వాహనాల నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేయాలని మంత్రి కాలవ శ్రీనివాసులు సూచించారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రహదారుల భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు, ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ లైసన్స్‌లు లేకుండా వాహనాలను నడపడం నేరమన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చేందుకు రహదారుల భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మంత్రి నూతన గృహ ప్రవేశం
పట్టణంలోని నేతాజీ రోడ్డులో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున మంత్రి కాలవ శ్రీనివాసులు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతోపాటు ఆత్మీయ అభిమానులు, నాయకులు హాజరయ్యారు.

మనసును అదుపులో ఉంచుకోవడమే శ్వాసపై ధ్యాస
బత్తలపల్లి, ఫిబ్రవరి 21: శరీరంతోపాటు మనసును అదుపులో ఉంచుకోవడానికి చేసే శ్వాసపై ధ్యాసే యోగా అని యోగా గురువు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి బత్తలపల్లిలోని షిరిడీ సాయి ఉన్నత పాఠశాలలో శ్రీమద్భగవద్గీత ధ్యాన, జ్ఞాన సప్తాహం కార్యక్రమాన్ని బత్తలపల్లి పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్‌రెడ్డి ప్రారంభోపన్యాసం ఇచ్చారు. శరీరం, మనసును అదుపులో ఉంచుకున్న వ్యక్తి శారీరక, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశాలు దాదాపు 90 శాతం తక్కువ అని చెప్పవచ్చన్నారు. అయితే ఇందుకు సాధన అవసరమని, సాధననే యోగాసనాలుగా పిలుస్తారని పేర్కొన్నారు. యోగాసనాలను క్రమబద్దంగా చేయాల్సి ఉంటుందని మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై
కేసు నమోదు చేయాలి
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 21: జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సుమోటాగా కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ సుబ్బారెడ్డిని బీజేపీ నాయకులు కలసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డిమాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత బాధ్యతాయుతమైన, అప్రజాస్వామిక, అనైతిక, జాతీయవాద వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు దేశద్రోహతకు తక్కువకాదని, దేశంలో విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించారన్నారు. అందుకు చంద్రబాబుపై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.