అనంతపురం

ప్రైవేటు చిట్ నడిపే వ్యక్తి ఐపి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 6: నగర సమీపంలోని కాశీవిశ్వనాథుని ఆలయం సమీపంలో నివాసం ఉంటుందన్న మహాబూబ్ పీరా అనే వ్యక్తి ఐపి నోటీసులను కోర్టు నుండి పంపారు. ఈ మేరకు రాణినగర్‌కు చెందిన కొంత మంది చీటీలు వేసుకున్న బాధితులు అబ్బాస్ ఇతరులు కలసి వన్ టౌన్ పోలీసులకు ఫిర్వాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనేక సంవత్సరాల నుండి మహాబూబ్‌పీరా ప్రైవేటు చీటీలు నడుపుకుంటూ ఉన్నారని, ఆయనను నమ్మి దాదాపు నగరంలోని 100 మంది దాకా 2కోట్ల చిట్‌లు వేసుకున్నారని తెలిపారు. మహాబూబ్ పీరా కోర్టు ఆశ్రయించి తాను ఆర్థికంగా చితికిపోయానని, నష్టపోయినని కోర్టు నుండి చిట్ వేసుకున్న బాధితులకు ఐపి నోటీసులు పంపించారు. దీంతో చిట్ వేసుకున్న బాధితులు కొంత మంది వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో సిఐ రాఘవన్ మాట్లాడుతూ కేసు కోర్టు ఫరిధిలో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నాడని, నిందితుడు వచ్చిన వేంటనే కేసు న నమోదు చేసుకుని దర్వాప్తు చేస్తామని తెలిపారు.