అనంతపురం

వ్యాధిగ్రస్థుడికి పోలీసుల చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 6:ప్రాణాంతక తలసీమియా వ్యాధితో బాధపడుతున్న కదిరికి చెందిన వంశీకృష్ణకు పోలీసులు చేయూతనిచ్చారు. పరిస్థితి చూసి పోలీసు హృదయాలు స్పందించాయి. ఈమేరకు బాధితుడికి స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో రూ.25,000 ఆర్థిక సాయం అందజేశారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉన్న వంశీకృష్ణ తలసీమియాతో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా తరచూ రక్తహీనతకు లోనవుతున్నాడు. శరీరంలో కొత్తరక్తం అభివృద్ధి చెందదు. దాతల సాయంతో ప్రతినెలా ఒకటి లేదా రెండు యూనిట్ల రక్తాన్ని ఎక్కించుకుంటూ ప్రాణాలు నిలుపుకుంటున్నాడు. రక్తం ఎక్కించుకున్న ప్రతిసారీ శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. దీన్ని నిరోధించాలంటే ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుంది.
ఐరన్ శాతం పెరిగితే లివర్‌పై ప్రభావం చూపుతుంది. ఆ మందులు వాడకపోతే వంశీకృష్ణ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇతని పరిస్థితిని సంజీవని రక్తదాతల సంస్థ నిర్వాహకుడు వి.రమణారెడ్డి ఎస్పీ కార్యాలయంలోని ఎస్పీ సీసీ ఏ.మురళీమోహన్‌కు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన డిపిఓలోని సహోద్యోగులు కెపి సుధాకర్ తన మినిస్టీరియల్ స్ట్ఫా ఏ9 అసిస్టెంట్, ఏ4 గోపి, ఆంజనేయప్రసాద్, శీన, నాగరాజు, సూపరింటెండెంట్ నిర్మల, భానులక్ష్మి, సత్యవతి సంయుక్తంగా రూ.25,100 సేకరించి మొతాన్ని ఎస్పీ చేత బాధితుడికి అందజేశారు.