అనంతపురం

సావిత్రిభాయి పూలే జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటి, జనవరి 2: ఆదునిక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావత్రిభాయి పూలే జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జిలాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో సావిత్రి భాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేశారని, సాంఘిక దురాచారాలను రూపుమాపాలంటే విద్య ప్రతి ఒక్కరికి అవసరమని గుర్తించి, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహిళ అని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయల జయంతిని స్మరించుకోవడానికి సావిత్రి జయంతి రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నేడు సావిత్రి బాయి పూలే జయంతిని యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్‌లో 10 గంటలకు నిర్వహిస్తున్నామని, యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగేంద్రబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్, నాగేంద్ర, నాయకులు రామకృష్ణ, ఐద్వా సావిత్రి, ప్రగతి పాల్గొన్నారు.
అంతర్జాతీయ నృత్య పోటీల్లో
అనంత చిన్నారుల ప్రతిభ
అనంతపురం కల్చరల్, జనవరి 2: అఖిల భారత సాంస్కృతిక సంఘ్ ఆధ్వర్యంలో పూనేలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో అనంత చిన్నారులు ప్రతిభ చాటారు. శ్రీ నృత్య కళానికేతన్ సంధ్యామూర్తి శిష్య బృందానికి చెందిన కుమారి దివ్యశ్రీ సీనియర్ కూచిపూడి విభాగంలో తృతీయ బహుమతి సాధించగా, జూనియర్ కూచిపూడి విభాగంలో కుమారి ప్రసన్నలక్ష్మి తృతీయ బహుమతి సాధించింది. శృతి, శరణ్యలకు ప్రతిభా పురస్కారం లభించింది. జూనియర్ భరత నాట్యం విభాగంలో కుమారి సాయి సంహితకు తృతీయ బహుమతి లభించింది. శిక్షణనిచ్చిన సంధ్యామూర్తికి విశిష్ట సత్కారం అభించింది. నగరానికి చెందిన చిన్నారులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించటం పట్ల పలువురు సంధ్యామూర్తికి అభినందనలు తెలిపారు.
19 నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు
* జెసి బి.లక్ష్మీకాంతం
అనంతపురం కల్చరల్, జనవరి 2: ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జెసి బి.లక్ష్మీకాంతం శనివారం ఒక ప్రకటన ద్వారా శనివారం తెలిపారు. మొదట వజ్రకరూరు, గుత్తి, రొద్దం, గోరంట్ల, ముదిగుబ్బ, కూడేరు మండలాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ ప్రమాణాలను అనుసరించి గ్రామైక్య సంఘాల ద్వారా కందులు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తమ వద్ద ఉన్న కందులను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. గ్రామైక్య సంఘాలకు మార్క్‌ఫెడ్, వెలుగు సంస్థలు శిక్షణ ఇచ్చి కొనుగోలుకు సంసిద్ధులను చేయాల్సిందిగా ఆదేశాలిచ్చామని జెసి తెలిపారు.
కాంగ్రెస్ ఎస్.సి సెల్ ఉపాధ్యక్షునిగా
ఆంజనేయులు
అనంతపురంటౌన్, జనవరి 2: కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి సెల్ జిల్లా ఉపాధ్యక్షునిగా వడియంపేట ఆంజనేయులును నియమిస్తూ ఉత్తర్వులను శనివారం పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌లు అందచేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధి పాల్గొన్నారు.