అనంతపురం

నేటి నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, మే 12: స్థానిక బ్రాహ్మణ వీధిలోని పట్టణ ప్రజల ఆరాధ్య దైవమైన లక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మ రథోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ వేడుకల్లో భాగంగా 14న ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాల్లో శ్రీవారు దర్శనమిస్తారు. 15న ఉదయం కామధేను వాహనం, సాయంత్రం సింహ వాహనం, 16న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమద్వాహనం, 17న ఉదయం పుష్పమండపంలో శ్రీవారు భక్తులను అలరించనున్నారు. 17న సాయంత్రం 6గంటలకు శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు నయనానందకరంగా జరగనున్నాయి. 18న ఉదయం 4గంటలకు గరుడోత్సవం, సాయంత్రం శేష వాహనం, రాత్రి గజ వాహనంలో స్వామి భక్తులను అలరించనున్నారు. 19న ఉదయం మడుగుతేరు, సాయంత్రం శ్రీవారి బ్రహ్మ రథోత్సవ వేడుకలు వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఘనంగా జరగనుంది. అదేరోజు సాయంత్రం ధూళోత్సవం, 20న సాయంత్రం అశ్వవాహనం, 21న ఉదయం పుష్పమంటపం, తదుపరి వసంతోత్సవం, సాయంత్రం హంస వాహనంలో చెన్నకేశవుడు భక్తులను కనువిందు చేయనున్నారు. 22న సాయంత్రం దేవతా ఉద్వాసన, 23న ఉదయం పుష్ప యాగం, తిరిగి సాయంత్రం శ్రీవారి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నట్లు ఆలయ నిర్వహణాధికారి నరసింహరాజు, ఆలయ అర్చకులు అర్చకం కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్‌లు తెలిపారు.

బెల్టుషాపులను ఎత్తివేయాలి
* ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌ను ముట్టడించిన మహిళలు
ఉరవకొండ, మే 12 : గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన బెల్టుషాపులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణంలోని ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌ను మహిళలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఉరవకొండ తాలుకా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పార్వతీప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పడిన కరవు పరిస్థితుల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మరోవైపు విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలుస్తుండటంతో మద్యం ఏరులై పారుతోందన్నారు. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం మద్యానికి ఖర్చు పెడుతున్నారన్నారు. ఫలితంగా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్వవహరిస్తున్నారన్నారు. అలాగే కల్తీమద్యం అమ్ముతున్నా నిర్మూలించడంలో ఎక్సైజ్ అధికారులు పూర్తి వైఫల్యం చెందారన్నారు. వెంటనే గ్రామాల్లో బెల్టుషాపులను ఎత్తివేయాలని, లేనిపక్షంలో దశలవారీగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మం డల కార్యదర్శి వన్నూర్‌సాబ్, సహా య కార్యదర్శి బసవరాజు, నాగరాజు, ప్రసాద్, పద్మావతి పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య
రాప్తాడు, మే 12: మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో కడుపునొప్పి తాళ లేక జోగి హేమలత(23) వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు అయ్యవారిపల్లికి చెందిన రామ్మోహన్ భార్య హేమలత గత మూడు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతుండేదని, గత ఆరు నెలల నుండి కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఎన్ని ఆస్పత్రులలో చూపించినా తగ్గలేదని, ఇదే క్రమంలో బుధవారం, గురువారం కూడా కడుపునొప్పి తీవ్రంగా వుందని కుటుంబ సభ్యులకు తెలిపింది. గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేరుశెనగ కాయల కోసం తెచ్చిన ఊజి మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ పరిస్థితి విషమిచండంతో బెంగళూరుకు తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రైతు ఆత్మహత్య
ఓబుళదేవరచెరువు, మే 12: మండల పరిధిలోని తంగేడుకుంటకు చెందిన ఉంగరాల మల్లికార్జున (49) అనే రైతు పురుగుల మందు తాగి గురువారం మృతి చెందాడు. వివరాలిలా వున్నాయి. మృతుడు మల్లికార్జున మధ్యాహ్నం సమయంలో తన వ్యవసాయ పొలంలోనే టమోటా చెట్ల మధ్య పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గుర్తించిన పశు కాపరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.