అనంతపురం

‘అనంత’ రాత మారేదెన్నడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 13 : కరవు పేరు చెబితే ఎవరికైనా అనంతపురం జిల్లానే గుర్తొస్తుంది. దేశంలోనే అత్యల్ప వర్షపాతంతో రాజస్థాన్‌లోని జై సల్మీర్ తర్వాత జిల్లా అత్యంత కరువు పీడిత ప్రాంతంగా రికార్డులకెక్కింది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోనే ప్రారంభించి దేశానికి అంకితం చేసింది. అందులోనూ కూడా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎడారి ఛాయలతో జిల్లాలోని పశ్చిమ దిశ నుంచి క్రమంగా ఇసుక మేటలు విస్తరిస్తున్నాయి. దశాబ్దాల క్రితమే ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ దుర్భర స్థితి వెలుగు చూసింది. జిల్లా సగటు వర్షపాతం 522 మి.మీటర్లు. అత్యల్పంగా అనంతపురం సమీపంలోని కూడేరు, ఆత్మకూరు ప్రాంతాల్లో 250 మి.మీటర్ల వర్షపాతం నమోదవుతోంది. జిల్లాకు దక్షిణ దిక్కున, కర్నాటక రాష్ట్రానికి అనుకుని ఉన్న హిందూపురం, మడకశిర ప్రాంతాల్లో గరిష్టంగా 600 మి.మీటర్ల వర్షం కురుస్తుంది. అయితే గత మూడు నాలుగేళ్లుగా వర్షపాతం అస్తవ్యస్తంగా ఉంటోంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు జిల్లాకు చేరే సరికి బలహీన పడి ఆశించినంత వర్షం కురవడం లేదని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇక హెచ్‌ఎల్‌సి, హంద్రీ నీవా, శ్రీరామరెడ్డి ప్రాజెక్టులతో పాటు జిల్లాలో పలు చిన్ననీటి పారుదల ప్రాజెక్టులున్నా ఆయకట్టు భూములు సాగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తాగునీటి కొరతతో గ్రామాల గొంతెండి పోతోంది. జిల్లాలోని 63 మండలాల్లోని 1003 గ్రామ పంచాయతీల్లోనూ ఈ దుస్థితి ఏటా వేధిస్తూనే ఉంది. ప్రభుత్వం ఏటా కరవు మండలాల్ని ప్రకటిస్తున్నా కంటి తుడిపు చర్యే అవుతోంది.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపైనే కొండంత ఆశ
పులి మీద పుట్రలా రాష్ట్ర విభజన జిల్లాను మరింతగా సమస్యల్లోకి నెట్టేసింది. విభజన హామీలను రెండేళ్లయినా నెరవేర్చడం లేదన్న ఆందోళనలు, ఆరోపణలు మిన్నంటుతున్న నేపథ్యంలో కనీసం ప్రత్యేక ప్యాకేజీ అయినా దక్కుతుందా.. అనే సందేహాలు జిల్లా వాసుల్ని వేధిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా దాదాపు 41 లక్షలు పైబడి ఉంది. ఇందుకు తగ్గట్టుగా ఉద్యోగావకాశాలు లేవు. సాగునీరు లేక ఆయకట్టులో లక్షలాది ఎరాలు బీడు బారింది. పరిశ్రమల స్థాపన అరచేతిలో వైకుంఠాన్ని తలపిస్తోంది. క్రీస్తుశకం 1800 నుంచి నుంచే అనేక కరవుల్ని ఎదుర్కొన్న ప్రాంతంగా జిల్లా చరిత్ర పుటలకెక్కింది. అప్పటి ప్రభువులు, శ్రీకృష్ణ దేవరాయలు, బ్రిటిష్ ప్రభుత్వాధికారులు తవ్వించిన చెరువులు, కుంటలు సైతం కనుమరుగవుతున్నాయి. జిల్లా సరిహద్దులో చిత్రావతి, పెన్నా, కుముద్వతి నదుల నుంచి వర్షపు నీరు సైతం జిల్లాకు రాకుండా కర్నాటక రాష్ట్రం ప్రాజెక్టులు కట్టేసింది. తుంగభద్ర డ్యామ్ నుంచి కేటాయింపుల మేరకు నీటి వాటా దక్కడం లేదు. కృష్ణా నదీ జలాలను తేవాలన్న ప్రయత్నాలూ కొలిక్కి కావడం లేదు. హంద్రీ నీవా పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర విభజన హామీలు జిల్లా వాసుల్ని ఆశల పల్లకిలో ఊరేగించాయి. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు తెచ్చిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలే శరణ్యమవుతున్నాయి. అయితే నిరుద్యోగిత నివారణ, సాగు, తాగునీటి సమస్యల్ని పరిష్కరించకుండా, వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఇతరత్రా పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా జిల్లాను కాపాడటం సాధ్యం కాదని ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ నేతలకు తెలియంది కాదు. అయినా దీర్ఘ కాలిక ప్రణాళికలతో జిల్లాను రక్షించాల్సి ఉన్నా.. పార్టీలకతీతంగా ముందుకు నడవాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోక పోవడం లేదు. దీంతో జిల్లా ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, బళ్లారి ప్రాంతాలకు వలసెళ్లి పోతున్నారు. పశువులు కబేళాలకు తరలి పోతున్నాయి.