అనంతపురం

టిటిడి రథయాత్రకు ‘పురం’లో ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 15 : రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర ఆదివారం సాయంత్రం హిందూపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పరిగి రోడ్డులోని కంచి కామాక్షి కల్యాణ మంటపం వద్ద ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలతోపాటు బిజెపి తదితర ప్రజా సంఘాల నాయకులు రథయాత్రకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పరిగి రోడ్డు, కెఎల్ రోడ్డు, రైల్వే రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం మీదుగా టిటిడి కల్యాణ మంటపం వరకు సాగింది. టిడిపి కల్యాణ మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి విగ్రహంతోపాటు రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయగా అనేక మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రథం ముందు ఆయా సంఘాల ప్రతినిధులు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహిస్తూ గోవింద నామ స్మరణ నిర్వహించారు. ఇక్కడి నుండి రథయాత్ర శ్రీకంఠాపురం, మల్లిరెడ్డిపల్లి, చోళసముద్రం మీదుగా లేపాక్షి చేరుకుని అక్కడి నుంచి చిలమత్తూరుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్ర, డిఇ రమేష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, బుల్లెట్వ్రి పాల్గొన్నారు.