అనంతపురం

రక్తసిక్తమైన జాతీయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, మే 19: కదిరి రూరల్ మండలం పట్నం గ్రామ సమీపంలో గురువారం ఉదయం 9గంటలకు జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సును కారు ఢీకొనడంతో కారులో ప్రయా ణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆంజనేయులునాయుడు (60), స్వరూప (47), రామయ్యనాయుడు (40), యసిత సాయి (14) నలుగురు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. వైఎస్‌ఆర్ కడప జిల్లా సుండుపల్లి సమీపంలో వున్న గుండుపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులునాయుడు కొన్ని సంవత్సరాల క్రితం కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారిలో ఫొటోస్టూడియో పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో స్వగ్రామంలో ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా కుమారుడు రామయ్యనాయుడు, కోడలు సునీత, మనమరాలు యసితసాయితోపాటు కల్యాణదుర్గంలో వుంటున్న చెల్లెలు స్వరూపతో కలిసి స్వగ్రామానికి ఉదయం బయలుదేరారు. పట్నం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కదిరి డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సును వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఆంజనేయులునాయుడు, రామయ్యనాయుడు, స్వరూ ప, యసిత సాయి అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జు కాగా కొన ఊపిరితో కొట్టుకుంటున్న సునీతను అతి కష్టం మీద బయటకు తీసి కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా వుండడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని కదిరి డిఎస్పీ వెంకటరామాంజనేయులు, రూరల్ సిఐ రవికుమార్, కదిరి ఎంవిఐ శేషాద్రి అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఇదే సందర్భంలో ఈ మార్గానే వెళ్తున్న రాయలసీమ ఐజి ప్రబాకర్‌రావు ఆగి ప్రమాదంపై డిఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైతులను ఆదుకోవడమే లక్ష్యం
సోమందేపల్లిలో విత్తన పంపిణీ అనంతరం మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ వేరుశెనగ పంట సాగు చేసి, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు నష్టం కలగకుండా లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ద్వారా ఆదుకునేందుకు ప్రభుత్వం 11వేల రెయిన్ గన్‌లను ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా ఫారంపాండ్లలో నిల్ల ఉన్న నీటిని వేరుశెనగ పంటలకు ఒకటి లేదా రెండు తడులతో పంట కాపాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో 7.5 లక్షల హెక్టార్లలో పంట సాగుతుందని, ఈ పంట దెబ్బతింటే కేవలం రూ.500 కోట్లు వస్తుందన్నారు. పంట బాగా వస్తే రూ.2వేల కోట్లు వస్తుందని, ఇందుకోసం చర్యలు తీసుకుంటోందన్నారు. జిప్సం, జింక్ సల్ఫేట్, కాంప్లెక్స్ ఎరువుల వంటి వాటిని రూ.1.88 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి సబ్సిడీతో అందించనున్నామన్నారు. జిల్లాలో హంద్రీ నీవానుపూరిక్త చేసి అన్ని చేరువులను నింపడం ద్వారా చెక్‌డ్యాంలు, ఫీడర్ చానళ్లు మరమ్మతులు వంటి వాటి ద్వారా భూగర్భ జలాలు పెంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ ఏడాది రూ.4500 కోట్లు ఆదాయం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జెసి-2 సయ్యద్ ఖాజామెహిద్దీన్, పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.