అనంతపురం

ఈఏడాది నుంచే రెసిడెన్సియల్ పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, మే 20 : నియోజకవర్గంలో ఈవిద్యా సంవత్సరం నుంచే బాల, బాలికలకు రెండు రెసిడెన్సియ ల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, బిసి వెల్ఫేర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాభార్గవి తెలిపారు. శుక్రవారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం 2016-17 విద్యా సంవత్సరం నుండి మడకశిర మండలంలోని గుండుమల, గుడిబండలో బాలుర, బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు అనుమతించిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8 తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సొంత భవనాలు పూర్తయ్యే వరకు అద్దె భవనాలు లేక ప్రభుత్వ సముదాయాల్లో నిర్వహిస్తామన్నారు. ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థులను అడ్మిషన్లు చేసుకోనున్నట్లు తెలిపారు. తక్కువ విద్యార్థులు ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లు, రెసిడెన్సియల్ పాఠశాలలకు విలీనం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 17 హాస్టళ్లను విలీనం చేస్తున్నట్లు చెప్పారు. కాగా పదో తరగతి ఈఏడాది 92 బిసి హాస్టళ్లలో 99.06 శాతం ఉత్తీర్ణత సాధించగా ఇందులో 72 హాస్టళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. పేదలకు కార్పొరేట్ విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎఎస్‌డబ్ల్యుఓ రామప్ప, సంక్షేమ శాఖ అధికారులు రామ్మోహన్, భీమప్ప, ఖాదర్‌బాషా, జడ్‌పిటిసి శ్రీనివాసమూర్తి, ఆదినారాయణ పాల్గొన్నారు.