అనంతపురం

నూతన పరిశోధనల కోసం సిలబస్ రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 27 : జెఎన్‌టియూ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నూతన పరిశోధనలకు అవసరమయ్యే విధంగా సిలబస్ రూపొందించాలని జెఎన్‌టియూ ఉపకులపతి ఆచార్య ఎంఎంఎం.సర్కార్ సూచించారు. శుక్రవారం స్థానిక ఈఈఈ విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బిఓఎస్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్‌తోపాటు నూతన పరిశోధనలకు అనుకూలంగా సిలబస్ రూపొంచాలని అన్ని యుజి బిఓఎస్ చైర్మన్లు, మెంబర్లకు సూచించారు. రిజిష్ట్రార్ ఆచార్య కృష్ణయ్య మాట్లాడుతూ ఎడ్యుకేషన్ గ్రిడ్ సిస్టమ్ ఎంతో అవసరమని, అన్ని యూనివర్సిటిల సిలబస్‌లను పరిశీలించి సిలబస్‌ను జాగ్రత్తగా రూపొందించాలన్నారు. డిఎపి ఆచార్య పి.ఆనందరావు మాట్లాడుతూ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మూక్స్‌ని ప్రవేశపెడతామన్నారు. క్రెడిట్ బెస్ట్ ఛాయింస్ సిస్టమ్ ప్రవేశపెట్టి మేజర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీలు కూడా ఇస్తామన్నారు. గ్రేడింగ్ సిస్టమ్స్, సిజిపిఎలను ప్రారంభిస్తామన్నారు. ఏపి ప్రభుత్వ సూచనలు మేరకు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి, స్పోర్ట్స్, కమ్యూనికేషన్‌పై అవగాహన కోసం ఆడిట్ కోర్సులు ప్రవేశపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియూ అధికారులు, యుజి బోర్డు చైర్మన్లు, మెంబర్లు పాల్గొన్నారు.