అనంతపురం

1 నుంచి అన్నీ అంతర్జాలంలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.హీరేహాల్, మే 27 : వచ్చేనెల 1వ తేదీ నుంచి రెవెన్యూ కార్యకలాపాలకు సంబంధించి అన్నీ అంతర్జాలంలోనే నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకూ సబ్సిడీ విత్తనాలు అందించాలన్నారు. విత్తన పంపిణీలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. వివిధ పనుల కోసం మండల కేంద్రానికి రాకుండా అందుబాటులో ఉండేవిధంగా అంతర్జాలంలో తమ సమస్యలను నమోదు చేయవచ్చన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం రోజూ అంతర్జాలంలో వస్తున్న ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించి, మళ్లీ అంతర్జాలంలోనే ఉంచుతారన్నారు. ఫిర్యాదుదారులు నేరుగా అంతర్జాలం ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అంతర్జాల విషయంలో రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని, రాబోవు రోజుల్లో రైతులకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అక్కడే ఉన్న కొంతమంది రైతుల ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించారు. సమావేశానికి ముందుగా మండల పరిధిలోని మురడి, కళ్యం, దొడగట్ట, కాదలూరు గ్రామాలకు చెందిన దళిత రైతులకు భూములు పంపిణీ చేయడానికి ఆయా గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.