అనంతపురం

ఉత్తమ మున్సిపాలిటీగా హిందూపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 30:పట్టణాల్లో పాలకులు చొరవ చూపితే పాలన మెరుగవుతుంది అనడానికి నిదర్శనం హిందూపురం, తాడిపత్రి మున్సిపాలిటీలే. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల రాష్ట్రంలోని 110 పట్టణాల్లో సర్వే నిర్వహించి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్‌టెన్‌లో జిల్లా నుండి ఏకంగా మూడు మున్సిపాలిటీలు ఎంపిక కావడం గమనార్హం. మూడు మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్ సేవలు మెరుగైన రీతిలో అందేలా చర్యలు తీసుకోవడమే ఎంపికకు కారణంగా కనిపిస్తోంది. గతంలో హిం దూపురం మున్సిపాలిటీలో అట్టడుగు స్థానాల్లో కనిపించేది. అయితే ఈ సారి కార్పొరేషన్‌లను మినహాయిస్తే మున్సిపాలిటీల జాబితాలో హిందూపురం రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తూ ఏకంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకొంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ ఆధ్వర్యంలో గత రెండేళ్ళలో హిందూపురం పట్టణాన్ని తీర్చిదిద్దడానికి విశేష కృషి జరిగింది. ఈ కృషికి ఫలితం దక్కింది. హిందూపురం పట్టణం ఏకంగా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడంతో కృషి చేసిన పాలకులు, అధికారులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మరింత కృషి చేయాలని పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడం, ఆస్తిపన్ను వసూళ్లు, సిటిజన్ చార్టర్ అమలు, ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను పరిష్కరించడ, స్కూళ్లలో ఐఐటి ఫౌండేషన్ తరగతులు ప్రారంభమయ్యేలా చూడటం, వ్యక్తిగత, ఉమ్మడి మరుగుదొడ్ల నిర్మా ణం, నిర్వహణ, ఎల్‌ఇడిల ఏర్పాటు, నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కారం, డ్వాక్రా గ్రూపులకు రుణాలు, యువతకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ, మొక్కల పెంపకం, మున్సిపల్ ఆర్థిక వనరుల నిర్వహణ, పనితీరును బట్టి సర్వే నిర్వహించి మార్కులు ఇచ్చారు. ఈ మార్కుల ఆధారంగా మున్సిపాలిటీలకు గ్రేడింగ్‌తోపాటు ర్యాకింగ్ ఇచ్చారు. ఈ ర్యాకింగ్ ఆధారంగా విశాఖపట్నంకు మొదటి ర్యాంక్ లభించగా అంతంత మాత్రం ఆర్థిక వనరులు ఉన్న హిందూపురానికి ఏకంగా రెండో ర్యాంక్ లభించింది. తాడిపత్రికి ఏడో స్థానం, గుంతకల్లుకు పదో స్థానం దక్కాయి.
పురంలో ప్రగతి ఇలా...
మున్సిపాలిటీలో నూతన పాలవర్గం కొలువు తీరాక ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి ఆధ్వర్యంలో పాలనాపరమైన మార్పులు చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఫలితాలు అందేలా చూశారు. పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంతో రెండేళ్ళలోనే ఏకంగా అగ్రస్థానంలోకి వెళ్ళగలిగారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి మెరుగయ్యేలా చర్యలు తీసుకున్నారు. పట్టణంలో 6,319 ఎల్‌ఇడిలు ఏర్పాటు చేశారు. పన్ను ఆదాయం రూ.15 కోట్లు రావాల్సి ఉండగా దాదాపు రూ.11 కోట్లు వసూలు చేశారు. పచ్చదనం పెంపులో భాగంగా 30 వేల మొక్కలు నాటారు. అభివృద్ధిలో భాగంగా పట్టణంలో మరుగు కాలువలు, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. నీటి వనరులు లేకపోయినా నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో రూ.20 లక్షల ఆదాయం వచ్చే పరిస్థితి నుండి రూ. కోటి నుండి రూ.1.60 కోట్లకు తీసుకెళ్లారు. పన్నుల వసూళ్ళలోనూ రికార్డు సాధించారు. డ్వాక్రా మహిళలకు రూ.35 కోట్ల రుణాలు ఇప్పించగలిగారు. డయల్ యువర్ ఛైర్‌పర్సన్, వార్డు పాదయాత్రలు నిర్వహించి నేరుగా ప్రజల నుండి సమస్యలు తె లుసుకొని పరిష్కరించడం జరిగింది.
అందరి సహకారంతోనే....
ప్రజలు, పాలకులు, అధికారులు ఇలా అందరి సహకారంతోనే పట్టణా న్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్య లు తీసుకున్నట్లు ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతో సహకారం అందించి పట్టణాభివృద్ధికి తగి న సూచననలు ఇచ్చారన్నారు. దీని వల్ల మరింత బాధ్యత పెరిగిందని, మరో మూడేళ్లు అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.