అనంతపురం

రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 2: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి రెండేళ్లు పూర్తయ్యిందని, ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ నవ నిర్మాణ దీక్షను జరుపుకుంటున్నామని, నూతన రాష్ట్ర నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, పార్థసారథి, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పి ఛైర్మన్ చమన్ సాబ్, ప్రభుత్వ విప్ యామినీ బాల, కలెక్టర్ కోన శశిధర్‌లు హాజరయ్యారు. నవ నిర్మాణ దీక్షలో టవర్‌క్లాక్ వద్ద పాల్గొన్న భారీ ప్రజలతో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రోడ్ల మీదకు వచ్చి సమైక్యాంద్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ప్రజల పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. ఎందరు ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోకుండా అశాస్ర్తియంగా విడగొట్టారన్నారు. రాష్ట్రం విడిపోయి 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ వున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. హంద్రీనీవా పూర్తి చేసి జిల్లా రైతాంగానికి నీటిని అందిస్తామన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా ప్రతి నీటి బొట్టును సంరక్షించి భూగర్భ జలాలను పెంచుతామన్నారు. అలాగే ఫారంపాండ్లు నిర్మాణం జిల్లాకు వరమని, జిల్లాలో లక్ష ఫారంపాండ్ల నిర్మాణ లక్ష్యం కాగా ప్రస్తుతం 30 వేలకు పైగా ఫారంపాండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నామన్నారు. ఇటీవల వర్షాల వల్ల ఈ ఫారంపాండ్లన్ని నీటితో నిండాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కళ్లతో సిఎం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. యుతవకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో నిన్నటి రోజున 8,926 మంది టీచర్లకు నియామక పత్రాలను అందజేసారన్నారు. త్వరలో పది వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న బీమా పథకం ప్రతి నిరుపేదలకు వరంలాంటిదన్నారు. ఇది అత్యుత్తమమైన బీమా పాలసీ అని, అర్హత గల జిల్లా వాసులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో బెల్, రాగ మయూరి ఎలక్ట్రానిక్ పార్క్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, సోలార్ పవర్ ప్రాజెక్టులు తదితర పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పుకుంటున్నాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరూ మరింత బాధ్యతతో కష్టించి పనిచేయాలన్నారు. అనంతరం 11 గంటలకు విజయవాడ నుండి నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను సిఎం చంద్రబాబు చేస్తుండగా జిల్లా ప్రజలు ఎల్‌ఇడి తెరలపై వీక్షిస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మదమంచి స్వరూప, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జెసి బి.లక్ష్మికాంతం, ఏజెసి సయ్యద్ ఖాజామొహద్దీన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గౌస్‌మొహిద్దీన్, జిల్లా అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.