అనంతపురం

రాష్ట్భ్రావృద్ధికి శ్రమిస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగానపల్లి, జూన్ 3:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ రాజధాని లేకుండా అడ్డగోలుగా విభజించారని, అయినప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినపుడు రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా ఏ మాత్రం చెదరకుండా రాష్ట్భ్రావృద్ధి కోసం పట్టువదలని విక్రమార్కుడులా ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం దగ్గర నవ నిర్మాణ దీక్షలో భాగంగా శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతు ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలుద్దామని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండు చేస్తు ప్రజలతో పాటు నేను కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. పేద ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారన్నారు. పంట సంజీవని అనంత కరవు జిల్లాకు వరప్రదాయిని అన్నారు. పంట సంజీవని ఫారంపాండ్ల ద్వారా 1.50టి ఎంసిల వర్షపు నీరు నిల్వ వుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రిని కొనియాడారు. ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి రాలేదన్న ఆక్రోశంతో మాట్లాడుతున్నారని మంత్రి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి గర్వపడాలే కానీ ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా వుందన్నారు. ఎవరు అవినీతిపరులో ప్రజలకు తెలుసునని, ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. 2050వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు వుంటారని, అది జగన్ గుర్తించుకుంటే మంచిదన్నారు. ఆర్‌డిఓ బాలానాయక్, తహశీల్దార్ శివయ్య, ఎంపిడిఓ జలజాక్షి, జిల్లా ఉపాధ్యక్షుడు నెట్టెం వెంకటేశులు, సర్పంచ్ బాలయ్య పాల్గొన్నారు.