అనంతపురం

టెన్షన్.. టెన్షన్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 3: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యా త్రలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొం ది. ఉద యమే జగన్ రోడ్‌షోకు ఉపక్రమిం చడం, ఆ సమయంలో టిడిపి నేతలు ర్యాలీ, ధర్నా చేస్తుండటం, అధికార పార్టీ ఆందోళనలో తాడిపత్రి ఎమ్మెల్యే సైతం పాల్గొనేందుకు వస్తున్నాడన్న సమాచారంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగా టిడిపి ఆందోళనకారులను శాంతింపజేసి జగన్ యాత్రకు అనుమించారు. అంతేగాకుండా జెసి ప్రభాకర్‌రెడ్డి సైతం ఆందోళనల ప్రాంతానికి రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 9 గంటలకే జగన్ రోడ్‌షోకు ఉపక్రమించడంతో పోలీసులు వారించి గంటపాటు బయటకు వెళ్లవద్దని సూచించారు. టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. రాస్తారోకో చేస్తున్న టిడిపి నేతలను పంపించిన తర్వాత రోడ్‌షోకు అనుమతించారు. వీటికితోడు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి కూడా యాడికి, పెద్దపప్పూరులో నిరసనలు తెలిపేందుకు వస్తున్నారంటూ ప్రచారం సాగింది. మరోవైపు పెద్దిరెడ్డి సైతం జనంతో రావడానికి సంసిద్ధులైనట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావారణ చోటు చేసుకుంటుందన్న ఆందోళన వ్యక్తమైంది. దీంతో యాడికి, పెద్దపప్పూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నాటి పరిణామాలతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు శుక్రవారం పూర్తి స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకూ పోలీసు కనుసన్నల్లో జగన్ భరోసా యాత్ర, రోడ్ షో సాగింది.
అప్రమత్తమై పోలీస్ యంత్రాంగం
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో యాత్ర కొనసాగుతుండగానే రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా-టిడిపి నేతల పరస్పర దాడులతో ఈనెల 5న ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు ధర్నాకు జగన్ హాజరుకానుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే శుక్రవారం సైతం యాడికిలో రోడ్‌షోలో సిఎం చంద్రబాబుపై జగన్ మళ్లీ పరుష పదజాలం వాడంతో టిడిపి శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. జిల్లావ్యాప్తంగా టిడిపి నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో జగన్ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో రాష్టస్థ్రాయి పోలీసు యంత్రాంగం మొదలు జిల్లా స్థాయి అధికారుల వరకు శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డిజిపి రాముడు జిల్లాలో శాంతిభద్రతలు, రాజకీయ పరిణామాలపై ఎస్పీ రాజశేఖరబాబుతో ఆరా తీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా డిజిపి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కాగా నేడు జగన్ కదిరి నియోజవర్గంలో యాత్ర చేపట్టనున్నారు. ఇటీవలే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ యాత్ర సందర్భంగా వైసిపి శ్రేణులు ఉద్రిక్తతలకు లోను కాకుండా పోలీసులు తగిన ముందస్తు చర్యలు చేపట్టారు.