అనంతపురం

బాలిక ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మఘట్ట, జూన్ 7 : మండలంలోని భిటిఫ్రాజెక్ట్ గ్రామానికి చెందిన ఆశాబీ (17) సోమవారం రాత్రి అత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి గోరీబీ తెలిపిన వివారాల మేరకు తన కూతురిని అదే గ్రామానికి చెందిన బెస్త గంగన్న కూమారుడు బెస్త రఘు వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ఇందులో భాగంగానే సోమవారం బంధువుల ఇంటికి వెళ్లి ఇంటికి వచ్చిన ఆశాబీని చితక బాదాడాని వాపోయింది. ఈ ఘటనలో తనను కూడా కొట్టాడని గోరీబీ తెలిపింది. దీంతో విరక్తి చెంది విష గుళికులు తినింది. దీంతో అపస్మారక స్థితికి చేరుకోడంతో రాయదుర్గం ప్రభుత్వ అసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాత్రి 3 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. ఎఎస్‌ఐ ప్రసాద్, జమేదార్ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.