అనంతపురం

నీటికుంటలో పడి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జూన్ 10 : మండల పరిధిలోని పి.నరసాపురానికి చెందిన అనిత (30) శుక్రవారం నీటి కుంటలో పడి మృతి చెందింది. గ్రామ సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు అనిత బట్టలను ఉతికేందుకు వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడే కొందరు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఊపిరాడక మృతి చెందింది. భర్త రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడి అనుమానాస్పద మృతి
గోరంట్ల, జూన్ 10 : మండల పరిధిలోని రాగిమేకలపల్లికి చెందిన ఓ బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాగిమేకలపల్లి విష్ణువర్ధన్‌నాయక్ (7) గొంతునొప్పితో శుక్రవారం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో హిందూపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిపై డాక్టర్ రుక్మిణమ్మ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదవశాత్తు యువకుడి మృతి
పెద్దవడుగూరు, జూన్ 10 : మండల పరిధిలోని ముప్పాలగుత్తి గ్రామ సమీపంలో బోరు లారీ అదుపు తప్పి కింద పడడంతో కార్మికుడు వోరా (23) మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ముప్పాలగుత్తిలో బోరు వేసేందుకు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బోరువెల్‌లో కార్మికుడిగా పని చేస్తున్న చతీష్‌గడ్‌కు చెందిన వోరా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు.