అనంతపురం

ఎస్సీల అభ్యున్నతకి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 10:ఎస్సీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని, చదువుకున్న షెడ్యూల్డు కులాల (ఎస్సీ) నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ(స్కిల్ డెవలప్‌మెంట్) ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ జూపూడి ఫ్రభాకరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ అందించే రుణాల లబ్ధిదారుల అవకాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకున్న ఎస్సీ నిరుద్యోగులకు తమ కార్పొరేషన్ ద్వారా లక్షమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాంగా త్వరలో మీ ఇంటికి లేఖలు పంపి మీ ఇంట్లో పదవ తరగతి నుండి డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్, మోకానికల్ తదితర విద్యార్హతలున్న వారికి శిక్షణ కల్పిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.1090 కోట్లు మంజూరు చేసి తనను చైర్మెన్‌గా ప్రభుత్వం నియమించిందన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలను తాను తప్పకు నెరవేరుస్తానని ఎస్సీల అభ్యున్నటికి కృషి చేస్తానన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా సామాజికపరమైన అభివృద్ధి చూసుకుంటే, కార్పొరేషన్ ఎస్సీ వ్యక్తిగత ఎదుగుదలకు పాటుపడుతాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20లక్షల కుటుంబాల్లో కోటిమంది జనాభ ఎస్సీలు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని ఎస్సీల అభ్యున్నతికి 2015-16 సంవత్సరంలో రూ.69కోట్లు మంజూరు చేశామని, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.100కోట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో చాలా చోట్ల బ్యాంకర్లు సహకరించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, పేద ఫ్రజలకు రుణాలు ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించే బ్యాంకు వారు విజయమాల్యావంటి బడాపారిశ్రామికవేత్తలకు, ఎగవేతదారులకు వేలకోట్ల రుణాలు ఇచ్చేందుకు మాత్రం వెనుకాడటం లేదన్నారు. ఎస్సీ నిరుద్యోగులకు శిక్షణ ఇప్పిస్తాం, వారికి రుణాలు అందించి వారు సమాజంలో స్వశక్తిగా ఎదిగేందుకు బ్యాంకర్లు తోడ్పాటునందించాలన్నారు. ఎస్సీలకు భూకొనుగోలు పథకం ద్వారా ఒక ఎకరాకు 5లక్షల రూపాయలు అందిస్తామని ఇందులో 2లక్షల సబ్సిడీ, 3లక్షలు బ్యాంకు రుణంగా ఉంటుందన్నారు. జిల్లాకు విడుదలైన నిధులను దళితులకు ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కలెక్టర్ కోనశశిధర్ మాట్లాడుతూ స్టాండప్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఒక కోటి రూపాయలకు ఔత్సహక పారిశ్రామికవేత్తలకు రుణంగా అందిస్తోందని తెలిపారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే పథకాలపై అవగాహన కలిగి, గ్రామాల్లో చర్చించి వాటి ద్వారా లబ్ధిపోందేలా తయారు కావాలన్నారు. 14 నియోజకవర్గ కేంద్రాల్లో 14 నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దేవానంద్, ఎమ్మెల్యేలు ఈరన్న, బి.కె.పార్థసారథి, హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి, మహిళా కార్పొరేషన్ డైరెక్టరు విశాలాక్షి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి రామచంద్ర, వ్యవసాయశాఖ జెడి శ్రీరామమూర్తి, ఇతర జిల్లా అధికారులు, దళిత సంఘాల నేతులు పాల్గొన్నారు.