అనంతపురం

పొగడ్తలు మాని..పనులు చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, జూన్ 13: చంద్రబాబునాయుడును పొగడ్తలతో ముంచెత్తుతూ కాలం వెళ్లదీస్తున్న తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు కరవు జిల్లాయైన అనంతపురాన్ని ఆదుకునేలా చర్యలు చేపట్టేలా అధినేత దృష్టికి తీసుకెళ్ళాలని పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్ హితవుపలికారు. సోమవారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన మాటలను విమర్శలుగా భావించవద్దని అన్నారు. బాబును పొగిడే క్రమంలో కొంత అనంత ప్రజల స్థితిగతులను కూడా అధినేతకు వివరించాలని అన్నారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిని తాము చేసినట్లుగా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. హంద్రీ నీవా ద్వారా జీడిపల్లికి కాంగ్రెస్ పార్టీ నీళ్లు తీసుకువస్తే దానిని చంద్రబాబు తీసుకువచ్చినట్లుగా ప్రచారం చేసుకోవటం తగదన్నారు. హెచ్‌ఎల్‌సికి తగినంత నీరు రాకపోవటంతో ఆయకట్టు భూములు కూడా సాగు లేక బీడు పెట్టాల్సి వచ్చిందన్నారు. హంద్రీ నీవా నీటితో చెరువులను నింపటం ద్వారా జిల్లాలో తాగునీటికి కొరత లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. దీనిని కూడా తమ ఘనతగా తెదేపా నేతలు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో ఐదున్నర లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విత్తన కొరత లేకుండా చేసిందన్నారు. అయితే తెదేపా ప్రభుత్వం నాసిరకం విత్తనాన్ని సరఫరా చేస్తూ పట్టాదారు పాసు పుస్తకం కలిగిన రైతులకు బయోమెట్రిక్ మిషన్ల ద్వారా సరఫరా చేసిందన్నారు. దీనితో వేలిముద్రలు పడక అధిక శాతం మంది రైతులకు వేరుశెనగ విత్తనం లభించని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాకు ఎయిమ్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే దానిని మంగళగిరికి తరలించుకు పోవడం దారుణమ న్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికై రూ పొందించిన ప్రాజెక్ట్ అనంతను అమలుచేసేలా అధి నేతపై వత్తిడి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు దాదాగాంధీ, వాసు, రామాంజనేయులు, కృష్ణ, రంగనాథ్ పాల్గొన్నారు.