అనంతపురం

జిల్లాను హరితానంతగా మారుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 17: జిల్లాను కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. అందులో భాగంగానే హరితానంత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో 1.13 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో హరితానంతగా జిల్లాను మారుస్తామన్నారు. శుక్రవారం రెవెన్యూభవన్‌లో హరితానంత కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు, పవన్ విద్యుత్ పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కనీసం 33 శాతం అడవులు ఉండాలని, అయితే ప్రస్తుతం అడవుల విస్తీర్ణం 10 శాతం కూడ లేనందున వర్షాలు సరిగా కురవక ప్రతియేటా కరవు కాటాకాల బారినపడుతున్నారన్నారు. జిల్లాలో దాదాపు 1800 కొండలు, గుట్టలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని వాటిలో గ్రామాలకు అర కిలోమీటరు సమీపంలో మొక్కలు వాటి సంరక్షించడానికి వీలుగా 615 బోడికొండలను గుర్తించామన్నారు. వీటిలో దాదాపు 400 కొండల్లో ట్రెంచెస్ కొట్టించి మొక్కలు నాటడానికి వీలుగా సిద్ధం చేశామన్నారు. ఈ కొండల్లో సమీప విండ్‌మిల్స్ యజమానులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, రైతులు, యువత, ఎన్‌జిఓలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మొక్కలు నాటి సంరక్షించేందుకు త్వరలో కొండ పండగను పండుగలా నిర్వహించడానికి అధికారులు కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో ఉద్యమస్థాయిలో 60 వేల ఫారంపాండ్లు నిర్మించడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం, నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాల ద్వారా వర్షపునీటి సంరక్షణను విజయవంతంగా చేపట్టామన్నారు. పవన విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు వారి ఆదాయంలో 3 శాతం కొండల్లో మొక్కలు నాటి, డ్రిప్‌ల ద్వారా నీరు అందించేందుకు ఖర్చు చేయాలన్నారు. మొక్కలు తామే అందిస్తామని, గుంతలు సైతం తామే తవ్విస్తామన్నారు. అవసరమైతే కొండ కింద ఒక నర్సరీ మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులలు దాదాపు 3 లక్షల మంది ఉన్నారని, వీరిలో హరితానంత స్ఫూర్తి నింపి ఒక్కొక్క విద్యార్థి 10వ తరగతి పూర్తి అయ్యేలోపు కనీసం 3 మొక్కలు నాటి సంరక్షించేలా చేస్తామన్నారు. అలాంటి విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి కాలేజికి వెళ్లే సమయంలో గ్రీన్ పాస్‌పోర్ట్ అందిస్తామని, భవిష్యత్తులో ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. అన్ని పాఠశాలల నర్సరీలు, డ్వామా, అటవీ నర్సరీల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని డిఎఫ్‌ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి బి.లక్ష్మికాంతం, డిఎఫ్‌ఓ చంద్రశేఖర్, వెంకటరమణ, జెడ్పి సిఇఓ రామచంద్ర, డ్వామా పిడి నాగభూషణం, హార్టికల్చర్ డిడి సుబ్బరాయుడు, ఎస్‌ఎస్‌ఎ పిఓ ఆచార్య దశరథరామయ్య, డిఇఓ అంజయ్య, డిపిఓ జగదీశ్వరమ్మ, నెడ్‌క్యాప్ డిఎం కోదండరామ్, ఇతర అధికారులు విండ్ మిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.