అనంతపురం

విరివిగా మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 17: రాష్ట్రంలో కరవును పారద్రోలి సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి సునీత అన్నారు. అందుకే కరవు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. శుక్రవారం నగరంలోని రాంనగర్‌లో మొక్కలు నాటిన మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 3 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టామని ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. 17వ తేదీ నుండి ఈకార్యక్రమాన్ని మొదలు పెట్టామన్నారు. ముందుగా నగరంలోని రోడ్లకిరువైపులా ప్రతిరోజు ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు మొక్కలు నాటుతామన్నారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీలు, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీచేసి, నాటి సంరక్షించేలా అంగీకార పత్రం తీసుకుంటామన్నారు. గతంలో నగరంలో లక్షల మొక్కలు నాటామని. అం దువల్లే నగరంలో పచ్చదనం కనపడుతోందన్నారు. వేప, మామిడి తదితర మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. రాబోయే మూడేళ్లలో 12 లక్షల మొక్కలు నాటాలన్నదే తమ లక్ష్యమన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 10 శాతం మాత్రమే పచ్చదనం ఉందని, దీనిని 33 శాతానికి తీసుకురావడానికే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఐదేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్క నాటి కాపాడాలన్నారు. మేయర్ మదమంచి స్వరూప మాట్లాడుతూ ఫ్రతి డివిజన్‌లో మొక్కలు నాటేందుకు డివిజన్ ఇన్‌చార్జిలు, టీం లీడర్లను నియమించినట్లు తెలిపారు. అనంతను హరిత నగరంగా మార్చాలన్నారు. రాంనగర్‌లో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే, మేయర్‌తోపాటు ఎస్పీ రాజశేఖరబాబు, డిప్యూటి మేయర్ గంపన్న తదితరులు మొక్కలు నాటారు. ఆర్డీఓ మలోలా, మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పాల్గొన్నారు.