అనంతపురం

పాల ధర తగ్గింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూన్ 23 : ప్రభుత్వం పాల ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ డి మాండ్ చేశారు. గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడి పి అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీనివల్ల వాటి పై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు ఇ బ్బందులకు గురవుతున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పాడి పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి అభివృద్ధి చేయగా టిడిపి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. పాల ధరలను తగ్గించడం, పాల సేకరణ నిలిపివేయడం బట్టి చూ స్తే ప్రభుత్వ డెయిరీలు మూసివేసే దిశ గా చర్యలు తీసుకుంటున్నట్లు అర్థం అవుతోందన్నారు. రైతుల నుంచి పాలను సేకరించి పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయవచ్చన్నారు. అలాగే తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయం వారు కర్నాటక పాలు తక్కువ ధరకు టెండర్లు వేయించి తీసుకుంటున్నారని, వెంటనే వాటిని రద్దు చేసి మనరాష్ట్ర పాలను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి తన హెరిటేజ్ డెయిరీని అభివృద్ధి చేసుకోవడానికి పాల ధరలు తగ్గించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పాల ధరలు పెంచి బకాయి బిల్లులు చెల్లించాలని లేనిపక్షంలో ఈనెల 30వ తేదీన మడకశిరలో పాడి రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. ఇకపోతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.84 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే మాఫీ చేయడం తగదన్నారు. ఈ సమావేశం లో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, దొడ య్య, సొరంగాల నాగరాజు, హనుమంతరెడ్డి, రంగనాథ్, నారాయణప్ప, నాగేంద్ర, నాగభూషణం, కొల్లేష్, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.