అనంతపురం

పురుషులతో సమానంగా మహిళలు రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 23 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు పురుషులతోపాటు అన్నిరంగాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని రైల్వే అదనపు డిజిపి కిషోర్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సువర్ణ భారతి కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ గతం కంటే ప్రస్తుతం విద్యా, ఉద్యోగాల్లో మహిళలు రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆరు వేల కానిస్టేబుల్ పో స్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో రెండు వేల దాకా మహిళలకు దక్కనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆర్డీటీ సంస్థ, సువర్ణ్భారతి జూనియర్ కళాశాల పరీక్షలకు హాజరయ్యేందుకు ఉ చిత శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం పట్ల అభినందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ల్లో డిగ్రీ వరకు చదువుకుని ఖాళీగా ఉన్న మ హిళలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. ఆర్డీటీ ఆర్డీ కృష్ణవేణి మాట్లాడుతూ ఆడ పిల్లకు చదువు, ఉద్యోగం రెండూ ఉండాలన్న ఉద్దేశంతో ఆర్డీటీ సంస్థ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూలై 11వతేదీ నుండి మూడు మాసాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నీలకంఠరెడ్డి, ఏఓ అనిల్‌కుమార్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.